Mushrooms: రోగనిరోధక శక్తి పెంచే మష్రూమ్ ఆమ్లెట్ - చలికాలంలో తింటే మంచిది
పోషకాలతో నిండిన ఆమ్లెట్ కావాలంటే ఇలా పుట్టగొడుగులతో ఆమ్లెట్ చేసుకోండి.
ఆమ్లెట్ అంటే చాలు ఎంతో మందికి నోరూరిపోతుంది. ఎప్పుడూ ఉల్లిపాయలు వేసి చేసుకుని చేసే ఆమ్లెట్ తింటే బోరు కొడుతోంది. ఇలా పుట్టగొడుగులతో ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
కావాల్సిన పదార్థాలు
పుట్టగొడుగులు - మూడు (చిన్నవి)
కోడి గుడ్లు - రెండు
పాలు - రెండు స్పూన్లు
తురిమి న చీజ్ - ఒక స్పూను
కొత్తి మీర తురుము - రెండు స్పూన్లు
మిరియాల పొడి - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా బటర్ - సరిపడా
తయారీ ఇలా...
1. పుట్టగొడుగులు చిన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేయాలి.
2. నూనె వేడెక్కాక పుట్ట గొడుగు ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించాలి.
3. పుట్టగొడుగులు ఉడకడం కోసం ముందుగా ఇలా కళాయిలో వేయించుకోవాలి. చిన్న మంట మీద ఉడికిస్తే అవి బాగా ఉడికిపోతాయి.
4. ఒక గిన్నెలో రెండు గుడ్లు, పాలు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా గిలక్కొట్టాలి.
5. ఈ మిశ్రమంలో ముందుగా ఉడికించుకున్న పుట్టగొడుగు ముక్కలను కూడా వేసి బాగా గిలక్కొట్టాలి.
6. కొత్తిమీర తరుగు కూడా కలుపుకోవాలి.
7. ఇప్పుడు పెనంపై నూనె లేదా బటర్ వేసుకుని ఆమ్లెట్ లా పోసుకోవాలి.
8. పైన చీజ్ తరుగు కూడా చల్లుకోవాలి.
9. రెండు వైపులా బాగా కాలాక తీసి ప్లేటులో వడ్డించుకోవాలి. దీని రుచి అదిరిపోతుంది.
ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఆహారం పుట్టగొడుగులు. మనం పూర్వ కాలం నుంచే పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకున్నాం. వీటిలో 80 శాతం నుంచి 90 శాతం వరకు నీళ్లే ఉంటాయి. ఇవి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే మధుమేహులకు కూడా ఇది మంచి ఆహారం. మానసిక ఆరోగ్యానికి పుట్టగొడుగులు ఎంతో మేలు చేస్తాయి. వారానికి కనీసం రెండు సార్లు వీటిని తినడం అత్యవసరం.
View this post on Instagram
Also read: చ్యవన్‌ప్రాష్ మొదటిసారి ఎప్పుడు తయారు చేశారో తెలుసా? దాన్ని తినాల్సిన పద్ధతి ఇది