(Source: ECI/ABP News/ABP Majha)
Cake: ఈ టిప్స్ పాటించారంటే ప్రెజర్ కుక్కర్లో కేక్ సింపుల్ గా చేసెయ్యొచ్చు
ఇంట్లో రుచికరమైన కేక్ తయారు చేసుకోవాలనుకుంటే ఓవెన్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు. నోరూరించే కేక్ రెడీ అయిపోతుంది.
కేక్ చేయాలంటే ఇంట్లో ఓవెన్ ఉంటే చాలా సులభంగా చేసేస్తారు. కానీ ప్రెజర్ కుక్కర్ లోనే సింపుల్ గా రుచికరమైన కేక్ తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మెత్తటి కేక్ ను రెడీ చేసుకోవచ్చు. పుట్టినరోజు, పార్టీ అంటే బయటకి వెళ్ళి కేక్ తెచ్చుకోకుండా ఇంట్లో చేసుకోవచ్చు. ప్రెజర్ కుక్కర్ లో కేక్ చేసే ముందు ఈ చిట్కాలు తప్పనిసరిగా పాటించండి.
ప్రీ హీటింగ్
ఓవెన్ ను ముందుగా వేడి చేయడం ఎంత ముఖ్యమో కుక్కర్ ను వేడి చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రీ హీటింగ్ వెనుక ప్రధాన లక్ష్యం కుక్కర్ లో వేడిని సమానంగా స్ప్రెడ్ చేయడం. దాని వల్ల కేక్ అన్ని వైపుల నుంచి ఉడికేలా చేస్తుంది. చల్లని కుక్కర్ లో కేక్ టిన్ ఉనకి ఆపై మంటలు ఆయన చేస్తే వేడి క్రమంగా పెరగడానికి సమయం పడుతుంది. ఇది కేక్ ని అసమానంగా ఉడికిస్తుంది. కేక్ వెలుపలి భాగం చాలా త్వరగా ఉడికిపోతుంది. కానీ లోపలి భాగం పచ్చిగా ఉంటుంది. అందుకే కేక్ టిన్ పెట్టె ముందు ప్రెజర్ కుక్కర్ ని సుమారు 8-10 నిమిషాలు ముందుగా వేడి చేసుకోవాలి.
టిన్ కు గ్రీజు చేయడం
కేక్ సులభంగా బయటకి రావడానికి టిన్ వెలుపల, అడుగున అంటుకోకుండా చూసుకోవాలి. టిన్ కి వెన్న లేదా బటర్ రాశి పార్చ్ మెంట్ పేపర్ తో లైన్ చేస్తారు ఒకవేళ మీ దగ్గర పార్చ్ మెంట్ పేపర్ లేకపోతే నూనె లేదా నెయ్యి, పిండి వేసుకుని టిన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సిలికాన్ బ్రష్ ఉపయోగించి లోపలి భాగంలో నుఎన్న సరిగా రాసుకోవాలి. పిండి వేసి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మిగిలిన పిండిని తీసేయాలి.
స్పాంజియర్ కేక్
కేక్ ఎప్పుడు మృదువుగా ఉండాలంటే ఒక చిన్న ట్రిక్ పాటించాలి. కేక్ పిండిలో కొంచెం వెనిగర్ జోడించుకోవాలి. ఇది పిండి మెత్తగా చేయడానికి 2-3 నిమిషాలు గిలకొట్టాలి. ఇది మెత్తదనం ఇస్తుంది.
ఉప్పు/ ఇసుక ఉపయోగించడం
సాధారణంగా కేక్ టిన్ కుక్కర్ లో పెట్టడానికి మెటల్ స్టాండ్ ని ఉపయోగిస్తారు. మెటల్ స్టాండ్ అనేది లైట్ వైట్ స్టాండ్. ఇది పెడితే వేడిని అన్ని వైపులా సమానంగా పంచుతుంది. మెటల్ స్టాండ్ లేకపోతే కుక్కర్లో కేక్ టిన్ పెట్టె ముందు ఉప్పు లేదా ఇసుకను ఉపయోగించుకోవచ్చు. కుక్కర్ లో 2-3 కప్పుల ఉప్పు లేదా ఇసుక పోసి దాన్ని సమం చేసుకోవాలి. వీటి ద్వారా కూడా వేడి సమానంగా స్ప్రెడ్ అవుతుంది. కేక్ ని సరిగా కాలుస్తుంది.
విజిల్ వద్దు
కుక్కర్ లో కేక్ చేసేటప్పుడు విజిల్ పెట్టొద్దు. విజిల్ వెయిట్ పెట్టకుండా ఉంటే మంచిది. ఆవిరి వల్ల బేకింగ్ ప్రక్రియ జరుగుతుంది. కేక్ చేయాలనుకుంటే వైడ్ బెస్ ప్రెజర్ కుక్కర్ ని ఉపయోగించాలి. ఇది కేక్ కి అన్ని వైపుల నుంచి సమానంగా ఉడికేలా చేస్తుంది.
Also read: పురుషుల్లో ఆ ముప్పు - పండ్లు, కూరగాయలే రక్షిస్తాయట!