News
News
వీడియోలు ఆటలు
X

Prostate Cancer: పురుషుల్లో ఆ ముప్పు - పండ్లు, కూరగాయలే రక్షిస్తాయట!

మగవారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ప్రొస్టేట్ క్యాన్సర్. దాన్ని ఎదుర్కోవాలంటే మంచి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

FOLLOW US: 
Share:

డవారిలో అధికంగా రొమ్ము క్యాన్సర్ వస్తే... మగవాళ్ళు ఎక్కువగా ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. రోజురోజుకీ దీని బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. యాభై ఏళ్లు దాటిన వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొస్టేట్ అనేది మగవారికి మాత్రమే ఉంటుంది. పునరుత్పత్తిలో ఇదొక భాగం. మూత్రాశయం కింద ఉంటుంది. దీనికి క్యాన్సర్ సోకితే పునరుత్పత్తి వ్యవస్థతో పాటు మూత్రాశయ వ్యవస్థ కూడా ఇబ్బంది పడుతుంది. అయితే ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం చక్కగా పని చేస్తుందని సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు.

పరిశోధన సాగింది ఇలా..

ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్న 116 మంది పురుషులు, ఈ క్యాన్సర్ తగ్గిన 132 మంది పురుషుల నుంచి ప్లాస్మా నమూనాలను తీసుకున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్న పురుషుల్లో సెలీనియం మూలకంతో పాటు లుటిన్, లైకోపీన్, ఆల్ఫా కెరోటిన్, బీటా కెరోటిన్ అనే సూక్ష్మ పోషకాల సాంద్రత తక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇవి పండ్లు, కూరగాయల్లో అధికంగా లభిస్తాయి. సెలీనియం తెల్ల మాంసం, చేపలు, షెల్ఫిష్, గుడ్లు, గింజల్లో కనిపిస్తుంది. సహజంగా లైకోపీన్ టమోటాలు, సీతాఫలాలు, ద్రాక్ష, పీచెస్, పుచ్చకాయలు, కాన్ బెర్రీస్ లో ఉంటుంది. సెలీనియం అధికంగా ఉండే ఆహారాలతో పాటు రంగు రంగుల మొక్కల ఆధారిత ఆహారాలు, ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకుంటే మంచిదని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు. పెద్దలు రోజుకి 1 ½ కప్పు నుంచి 2 కప్పుల వరకు పండ్లు, 2 నుంచి 3 కప్పుల వరకు కూరగాయలు తింటే ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు

ఇది వచ్చేందుకు సరైన కారణాలు లేవు. కానీ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, ఊబకాయం వంటి వాటి వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ క్యాన్సర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు.

⦿ హఠాత్తుగా బరువు తగ్గడం

⦿ రాత్రి వేళ మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్ళడం. ఇది మధుమేహం లక్షణం కూడా కావొచ్చు కానీ ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.

⦿ మూత్రం లేదా వీర్యంలో రక్తం కనిపించడం

⦿ మూత్ర విసర్జనకు కొన్ని సార్లు ఇబ్బంది

⦿ శరీర భాగాల్లో నొప్పులు

⦿ వాంతులు, వికారం

ఈ క్యాన్సర్ ని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. లేదంటే పక్క అవయవాలకు కూడా పాకి ప్రాణాంతకం కావొచ్చు. ఎందుకంటే ప్రొస్టేట్ క్యాన్సర్ నిశ్శబ్ద క్యాన్సర్. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతకి తగినట్టు ప్రభావితమవుతుంది. అందుకే హార్మోన్ల అసమతుల్యత రాకుండా చూసుకోవాలి. ఆవుపాలలో ఈస్ట్రోజెన్ అధికంగా ఉంటుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే మగవాళ్ళు ఆవు పాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే దీని బారిన పడకుండా ఉండవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Published at : 28 Mar 2023 08:54 PM (IST) Tags: Fruits Prostate cancer Prostate cancer symptoms Vegetables Prostate Cancer Precautions

సంబంధిత కథనాలు

Milk in Dream: పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా? మీకేం జరగబోతోందో తెలుసా?

Milk in Dream: పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా? మీకేం జరగబోతోందో తెలుసా?

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు?  ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

టాప్ స్టోరీస్

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి