By: ABP Desam | Updated at : 28 Mar 2023 01:44 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pixabay
ఈ వేసవిలో చల్లగా ఉండే పానీయాల వెంట పడుతూ ఉంటారు. రుచికరమైన కోల్డ్ కాఫీ సీమ చేస్తూ పని చేసుకుంటుంటే అద్భుతంగా ఉంటుంది. కానీ కోల్డ్ కాఫీ రుచి మాత్రమే కాదు బరువుని కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇది కేలరీలు అధికం. బరువు తగ్గాలి, చల్లగా ఉండాలంటే ఈ వెరైటీ కాఫీలు ట్రై చేసి చూడండి. సంథింగ్ స్పెషల్ కావాలనుకునే వారికి ఈ కాఫీలు ఉత్తమ ఎంపిక. ఇవి తాగారంటే బరువు పెరుగుతారనే ఆలోచన భయం ఉండదు. పైగా చల్లని పానీయాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
కోల్డ్ బ్రూ
కోల్డ్ బ్రూయింగ్ అనేది కాఫీ గింజలను గది ఉష్ణోగ్రత నీటిలో 20 గంటల కంటే ఎక్కువ సేపు ఉంచి కాఫీని తయారు చేసే పద్ధతి. ఈ బ్రూయింగ్ పద్ధతికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఇంట్లో ఈ కాఫీని తయారుచేయడానికి చాలా సులభమైన పద్ధతి ఒకటుంటుంది. దీన్ని తయారు చేసుకోవడం చాలా సులభం. ఎటువంటి పరికరాలు అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా 1:12 నిష్పత్తిలో రాత్రిపూట నీటిలో కాఫీ గింజలు నానబెట్టుకోవాలి. అంటే ఒక కేజీ కాఫీ పొడి తీసుకుని అందులో 12 లీటర్ల నీటిని పోసుకోవాలి. ఇలా చేసిన దాన్ని 7-8 రోజుల పాటు రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ కాఫీ తియ్యగా ఉండాలనుకుంటే డానికి కొన్ని సిట్రిక్ రుచులు, స్వీటేనర్లు కూడా జోడించుకోవచ్చు.
దాల్చిన చెక్క కాఫీ
దాల్చిన చెక్కతో టీ చేసుకుంటే చాలా మంచిది. మధుమేహులకు ఇది చక్కని ఎంపిక. ఇప్పుడు అలాగే దాల్చిన చెక్క కాఫీ చేసుకోవచ్చు. ఒక కప్పు బ్లాక్ కాఫీలో చిటికెడు దాల్చిన చెక్క కలిపేయండి. అది మీ కొవ్వుని కాల్చేస్తుంది. జీవక్రియ రేటుని పెంచుతుంది. దాల్చిన చెక్కలోని కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్ల కలయిక బరువు తగ్గింపు ప్రక్రియని వేగవంతం చేయడంతో సహాయపడుతుంది.
ఐస్డ్ ఆమెరికానో
ఇంట్లో సింపుల్ గా చేసుకోగలిగే అద్భుతమైన కాఫీల్లో ఇది ఒకటి. ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని అందులో ఐస్, కొంచెం నీళ్ళు కలపాలి. అందులో ఎస్ప్రెస్సో డబుల్ షాట్ వేసుకోవాలి. ఇందులో తక్కువ కొవ్వు ఉన్న బాదం పాలు, స్వీటేనర్ ను జోడించుకుని తాగొచ్చు.
నిమ్మకాయ కాఫీ
ఒక కప్పు కాఫీలో నిమ్మరసం, దాల్చిన చెక్క వేసుకుంటే నిమ్మకాయ కాఫీ రెడీ అయిపోతుంది. ఇది కొవ్వుని కాల్చే ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఈ పానీయం జీవక్రియ రేటుని పెంచుతుంది. శరీరం నుంచి విష వ్యర్థాలని బయటకి పంపద్యంలో సహాయపడుతుంది.
పాలు ఆధారిత ఐస్డ్ లాట్
ఐస్డ్ లాట్ అనేది వేసవిలో సరేరాన్ని చల్లబరిచే ఎస్ప్రెస్సో పానీయం. తక్కువ కొవ్వు పాలు, ఎస్ప్రెస్సో కలిపో తయారు చేస్తారు. 45 ఎంఎల్ ఎస్ప్రెస్సో, 150 ఎంఎల్ తక్కువ కొవ్వు పాలు, 70 గ్రాముల ఐస్ క్యూబ్స్ ఇందులో వేసుకోవాలి. గ్లాసులో ఐస్ ముక్కలు వేసుకుని దాని మీద చల్లటి పాలు పోసుకోవాలి. డబుల్ షాట్ ఎస్ప్రెస్సో ని కొద్ది కొద్దిగా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీ ఐస్డ్ లాట్ కాఫీ రెడీ అయిపోతుంది. ఇందులో కాస్త స్టెవియా జోడించుకోవచ్చు. ఇందులో మంచి ట్విస్ట్ కోసం వెనీలా, కారామెల్, హాజెల్ నట వంటి రుచులు కూడా జోడించుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఒత్తిడి తగ్గించుకోవాలా? మాగిన అరటిపండు తినేయండి - ఇంకా లాభాలెన్నో!
Memory Loss: లైంగిక జీవితం సంతృప్తిగా లేకపోతే మతిమరపు వస్తుందా? స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి
డయాబెటిక్ కంటి సమస్యలకు కొత్త మందు? కొత్త ఆవిష్కరణలు ఏం చెబుతున్నాయి?
Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?
Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం
Thyroid Cancer: పదే పదే బాత్రూమ్కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్కు సంకేతం కావచ్చు
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?