News
News
X

Telugu Recipes: కోడిగుడ్డుతో గుంతపొంగనాలు, పిల్లలకు బెస్ట్ అల్పాహారం

రోజూ అల్పాహారం ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? కోడిగుడ్డుతో గుంత పొంగనాలు చేసుకుని చూడండి.

FOLLOW US: 
Share:

రోజులో ముఖ్యమైన ఆహారం అల్పాహారమే. అది పోషకాల మిళితంగా ఉండాలి. ఎప్పుడు ఇడ్లీ, దోశె, గోధుమతో చేసిన పూరీ, మైసూర్ బోండా వంటివి తిని తినీ బోరు కొడితే  కొన్ని సార్లు కోడిగుడ్డుతో గుంతపొంగనాలు చేసుకుని తినండి. చేయడం చాలా సులువు. కేవలం పదినిమిషాల్లో ఇవి రెడీ అయిపోతాయి. పొట్ట కూడా నిండుగా ఉంటుంది. దీనికి చట్నీ కూడా అవసరం ఉండదు కాబట్టి, టైమ్ కూడా కలిసొస్తుంది. సమయం తక్కువ ఉన్నప్పుడు వీటిని చేసుకుని తినేయండి. 

కావాల్సిన పదార్థాలు 
కోడి గుడ్లు - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
గరం మసాలా - అర స్పూను
మిరియాల పొడి - చిటికెడు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు 
నిమ్మరసం - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు 
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు స్పూను

తయారీ ఇలా
1. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నాలుగు గుడ్లు కొట్టి గిలక్కొట్టాలి. 
 
2. ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. 

3. గరం మసాలా, ధనియాల పొడి, పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. 

4. అందులో కొత్తిమీర తరుగు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. 

5. ఇప్పుడు స్టవ్ మీద గుంతపొంగనాలు వేసుకునే కళాయి పెట్టి వేడి చేయాలి. 

6. కాస్త నూనెను గుంతల్లో పోయాలి. ఇలా అయితే పొంగనాల అతుక్కోకుండా వస్తాయి. 

7. ఆ గుంతల్లో కోడి గుడ్ల మిశ్రమాన్ని వేసి, చిన్న మంట మీద పెట్టి మూత పెట్టాలి. 

8. మూడు నిమిషాల తరువాత స్పూను రెండో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఓ మూడు నిమిషాల కాలాక స్టవ్ కట్టయాలి. 

టేస్టీ కోడిగుడ్లు గుంత పొంగనాలు రెడీ  అయిపోయాయి. వీటిని తినేందుకు ఎలాంటి చట్నీ అవసరం లేదు. సాస్‌లో ముంచుకుని తిన్నా చాలు.  అయితే ఇవి చల్లారిన తరువాత టేస్ట్ అంతగా అనిపించవు. కాబట్టి వేడి వేడిగా ఉన్నప్పుడు తినేయాలి.

తినడం వల్ల...
రోజుకో గుడ్డు వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని ఇది వరకే విన్నారు. కోడిగుడ్డుతో చేసిన గుంత పొంగనాల వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, మిరియాల పొడి, కొత్తిమీర కూడా ఉన్నాయి. వీటిలోని పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. కోడిగుడ్డుతో చేసిన గుంత పొంగనాలు తినడం వల్ల శరీరానికే కాదు, చర్మానికి, జుట్టుకు కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గోళ్లు అందంగా ఎదుగుతాయి. వీటిలో ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే సల్ఫర్, అనేక విటమిన్లు కూడా ఉంటాయి. ఇవన్నీ శరీరంలోని అణువణువుకు శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి.  

Also read: కొత్త ఏడాది వేడుకల్లో అతిగా మద్యం తాగాలనుకుంటున్నారా? అయితే మీ శరీరంలో ఏం జరుగుతుందంటే

Published at : 24 Dec 2022 12:20 PM (IST) Tags: Simple Breakfast Egg Recipes Telugu Recipes Egg Breakfast

సంబంధిత కథనాలు

Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?

Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే  నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

Dosa Recipe: పెసరపప్పు - సొరకాయతో క్రిస్పీ దోశె, పిల్లలకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

Dosa Recipe: పెసరపప్పు - సొరకాయతో క్రిస్పీ దోశె, పిల్లలకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

Paneer Curry: చపాతీలోకి అదిరిపోయేలా పనీర్ మేథి కూర

Paneer Curry: చపాతీలోకి అదిరిపోయేలా పనీర్ మేథి కూర

Biryani ATM: ఈ ఏటీఎంలో డబ్బులు కాదు నోరూరించే వేడి వేడి బిర్యానీ వస్తుంది- భారత్ లోనే తొలి బిర్యానీ ఏటీఎం!

Biryani ATM: ఈ ఏటీఎంలో డబ్బులు కాదు నోరూరించే వేడి వేడి బిర్యానీ వస్తుంది- భారత్ లోనే తొలి బిర్యానీ ఏటీఎం!

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల