New Year 2023: కొత్త ఏడాది వేడుకల్లో అతిగా మద్యం తాగాలనుకుంటున్నారా? అయితే మీ శరీరంలో ఏం జరుగుతుందంటే
New Year 2023: కొత్త ఏడాది వచ్చేస్తుంది. పార్టీలకు రెడీ అయిపోతుంటారు చాలా మంది. అందులో మందు పార్టీలే ఎక్కువ.
New Year 2023: కొత్త ఏడాది వచ్చిందంటే పార్టీల్లో మందు ఉండాల్సిందే. బీర్ నుంచి విస్కీ దాకా అన్ని రకాల మద్యాన్ని తాగి కిక్కెక్కిపోతుంది యువత. కానీ అలా తాగే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మద్యం మీ శరీరంలో చేరాక ఏం చేస్తుందో అవగాహన అవసరం. మద్యాన్ని తాగేందుకు మానసిక ఉల్లాసం కోసం. కేవలం మితంగా తాగితే చాలు ఆ ఉల్లాసం వచ్చేస్తుంది. అంతేకాదు మెదడు ఉత్తేజితమవుతుంది. శరీరంలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. శరీరంలో ఎండార్ఫిన్, డోపమైన వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవన్నీ జరిగతే కేవలం ఒక గ్లాసుతో ఆపే వాళ్లలో. కానీ గ్లాసు తరువాత గ్లాసు.. వరుసలపెట్టి తాగే వారిలో మాత్రం ఇవన్నీ జరగవు.
ప్రభావం ఇలా...
ఆహారమైనా, పానీయమైనా మితంగా తింటేనే ఆరోగ్యం. అమితంగా శరీరంలో చేరడం వల్ల అవి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మద్యం శరీరంలో చేరాక ప్రభావం మొదట పడేది మెదడుపైనే. మితంగా తాగితే మెదడు ఉల్లాసంగా ఉంటుంది, అదే అధికంగా తాగితే పనిచేసే విధానం మందకొడిగా మారుతుంది. శ్వాస కూడా నెమ్మదిగా ఆడుతుంది. గుండు కొట్టుకునే వేగం కూడా నెమ్మదిస్తుంది. ఇవన్నీ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అతిగా తాగడం వల్ల రక్తంలో ఆల్కహాల్ చేరుతుంది. దీనితో శరీర అవయవాల మధ్య సమన్వయం ఉండదు. విచక్షణ కూడా లోపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియదు.
ఆల్కహాల్ చాలా వేగంగా అవయవాలను చేరుకుంటుంది.రక్తంలో కలిసి ఇతర అవయవాలకు చేరుతుంది. ముఖ్యంగా మెదడు, కాలేయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆ ఆల్కహాల్ కణాలను విరిచేసేందుకు కాలేయం పని మొదలుపెడుతుంది. దీని కోసం చాలా కష్టపడుతుంది. మొదట ఆల్కహాల్ ఎసిటాల్డిహైడ్‌గా మారుతుంది. దీని వల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే అతిగా మద్యం తాగేవారికి కాలేయ జబ్బులు వస్తాయి. ముఖ్యంగా హెపటైటిస్, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మద్యాన్ని అధికంగా తాగవద్దని వైద్యులు చెబుతుంటారు. కాలేయం చెడిపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
మద్యం తాగాక కొందరికి తీవ్రంగా వాంతులు, విరేచనాలు అవుతాయి. అంటే అర్థం మీ శరీరం ఆల్కహాల్‌ను భరించలేకపోతోందని అర్థం. ఆల్కహాల్ విచ్ఛిన్నమైనప్పుడు ఎలిటాల్డిహైడ్ అనే రసాయన పదార్థం విడుదలవుతుంది. అదే అన్ని నష్టాలకు కారణం. కాబట్టి కొత్త ఏడాదిని కేవలం మద్యం తాగుతూనే ఆహ్వానించాలని లేదు, ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. వీలైనంత వరకు ఒక గ్లాసుతో ఆపేయడానికే చూడాలి.
Also read: పొట్ట క్లీన్ అవ్వాలా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.