అన్వేషించండి

Ratan Tata Love Story : రతన్ టాటా పర్సనల్ లైఫ్.. ఆమె ప్రేమ దక్కలేదు, కానీ పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ మాత్రం అది కాదట

Ratan Tata passes away: వ్యాపార దిగ్గజం రతన్ టాటా తుది శ్వాస విడిచారు. అయితే తన చనిపోయే సమయంలో అతని పక్కన.. నా అనే సొంత ఫ్యామిలీ ఎవరూ లేరు. ఇంతకీ రతన్ టాటా పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఏంటి?

Ratan Tata Childhood and Lovestory : రతన్​ టాటా (Ratan Tata Died)ఇక లేరు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆయన 2024, అక్టోబర్ 9న తుది శ్వాస విడిచారు. లక్షల కోట్లకు అధిపతి అయిన రతన్ టాటా.. తన చివరి దశలో ఒంటరిగానే వెళ్లిపోయారు. చనిపోయే ముందువరకు ఆయన యాక్టివ్​గానే ఉన్నారు. కానీ వయసురీత్యా వచ్చే సమస్యలు అతనిని ఒంటరిగా వదల్లేదు. తమతోపాటే తీసుకుని వెళ్లిపోయాయి. కానీ పర్సనల్​ లైఫ్​లో చూసుకుంటే మాత్రం.. ఆయనకు పెళ్లికాలేదు.. కిడ్స్ లేరు. లవ్ స్టోరీ అందరికీ తెలియొచ్చు.. కానీ పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ మాత్రం అదికాదట. 

రతన్ టాటా పలు ఇంటర్వ్యూల్లో తన ప్రేమ, పెళ్లి గురించిన ప్రశ్నలకు చక్కగా నవ్వుతూ సమాధానం ఇచ్చేవారు. ఆయన బ్యాచ్​లర్​గా మిగిలిపోవడానికి రీజన్స్ ఇవేనంటూ ఫన్నీగా బదులిచ్చేవారు. ముఖ్యంగా ఆయన లవ్​ స్టోరి గురించి చాలామందికి ఇంట్రెస్ట్ ఉండేది. ఆరోజుల్లో లాస్ ఏంజెల్స్​లో లవ్ స్టోరీ నడిపించారు రతన్ టాటా. ఎంతటి వారికైనా పర్సనల్​ లైఫ్​ ఎఫెక్ట్.. లవ్​ లైఫ్​పై పడుతుందనేదానికి రతన్ టాటానే ఎగ్జాంపుల్. 

రతన్ టాటా ఫస్ట్ లవ్.. (Ratan Tata First Love)

రతన్ టాటా ఆర్కిటెక్చర్​లో గ్రాడ్యూయేషన్ అయ్యారు. అనంతరం లాస్ ఏంజెల్స్​లో రెండు సంవత్సరాలు పని చేశారు. అక్కడ పనిచేయడం రతన్ టాటాకు చాలా నచ్చిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సొంత కారు ఉండేదట.. జాబ్ నచ్చేదట. ఆ సమయంలోనే రతన్ టాటా ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే టైమ్​కి తన బామ్మ ఆరోగ్యం క్రిటికల్​గా ఉందని ఇండియా తరిగివచ్చేశారు. ఆ అమ్మాయిని కూడా ఇండియాకి తీసుకెళ్లేందుకు చూశారు కానీ.. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధం కారణంగా అమ్మాయి పేరెంట్స్ ఆమెను ఇండియాకు పంపేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆయన ప్రేమ పెళ్లిదాక చేరుకోలేకపోయింది. 

బామ్మవల్లే బ్రేకప్ అయింది కానీ బామ్మే ఎక్కువ..(Ratan Tata Childhood)

రతన్ టాటాకు నానమ్మ అంటే చాలా ప్రేమ, గౌరవం. ఎందుకంటే ఆయన చిన్నతనంలో తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అప్పట్లో ఇది కామన్​ కాదని.. తను, అతని తమ్ముడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని రతన్ తెలిపారు. ఆ సమయంలో తన నానమ్మ నేర్పిన విలువలే ఇప్పటికీ ముందుకు నడిపించాయని వెల్లడించారు. తల్లి రెండో పెళ్లి చేసుకోవడంతో స్కూల్​లో ర్యాగింగ్ చేసేవారట. అలా అని తండ్రి ఆలోచనలను, ఆయన ఆలోచనలు ఎప్పుడూ భిన్నంగా ఉండేవట. కానీ ఆయన నానమ్మ మాత్రం లైఫ్​లో ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో వంటి విషయాలన్నీ నేర్పడంతో ఆయన ఆమెకు ఎక్కువ దగ్గరైపోయారు. అందుకే ఆమె ఆరోగ్య బాగోలేదని తెలిసి.. లాస్ ఎంజెల్స్​ని తిరిగి వచ్చేశారు. ప్రేమ దూరమవుతుందని తెలిసినా.. నానమ్మ పక్కనే ఉన్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ratan Tata (@ratantata)

 

పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. 

అయితే బ్రేకప్ తర్వాత అక్కడే ఆగిపోవాలనుకోలేదు రతన్ టాటా. చాలాసార్లు పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ.. కుదర్లేదని చెప్పేవారు. పనిలో బిజీగా ఉండడం వల్ల దానిపై ఫోకస్ చేసే సమయంలో దొరకలేదని చెప్పేవారు కానీ.. ఫ్యామిలీ లేకపోవడం వల్ల కొన్నిసార్లు ఒంటరిగా ఫీల్ అయ్యేవాడినని కూడా రతన్ టాటా తెలిపారు. 

డేటింగ్ రూమర్స్..(Ratan Tata Dating Rumors) 

పెళ్లి అయితే కాలేదు కానీ.. రతన్ టాటాపై పలు డేటింగ్ రూమర్స్ వచ్చేవి. ముఖ్యంగా సిమిగ్రేవాల్ అనే నటితో డేట్ చేశారనే వార్తలు అప్పట్లో వచ్చేవి. ఎందుకంటే సిమిగ్రేవాల్ రతన్ టాటాతో డేటింగ్ గురించి ఓపెన్​గా చెప్పారు. కానీ రతన్ టాటా మాత్రం ఈ విషయంపై ఎప్పుడూ స్టేట్​మెంట్ ఇవ్వలేదు. 

ఆయనకు ఇష్టమైన పనులనే అలవాట్లుగా చేసుకున్నారు. కానీ ఎంత చేసినా చివరికి ఒంటరిగానే వెళ్లిపోయారు. ఆయన అనుకుని ఉంటే.. పెళ్లి ఏ వయసులోనైనా జరిగేది. కానీ రతన్ టాటాకు ఉన్న కొన్ని ఎథిక్స్​ కూడా ఆయనను పెళ్లికి, ఫ్యామిలీ స్టార్ట్ చేయడానికి దూరం చేసి ఉండొచ్చు. ముఖ్యంగా చిన్నతనంలోనే పేరెంట్స్ డివోర్స్ అనే విషయం పిల్లలపై చెరగని ముద్ర వేస్తుంది. దాని ఎఫెక్ట్ కూడా రతన్ టాటాపై ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా పర్సనల్​ లైఫ్​లో ఆయనకు ప్రేమ దక్కలేదు కానీ.. ప్రతి ఇండియన్ ఆయనని ప్రేమిస్తారు. ఆయనకి గౌరవిస్తారు. ఆయన సేవా దృక్పథంతో కొన్ని కోట్ల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు రతన్ టాటా. 

Also Read : రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన వ్యాపార దిగ్గజం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
Pushpa 2: 'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
7G The Dark Story OTT Telugu: ఓటీటీలోకి '7/జి'... ఇది బృందావన కాలనీ కాదు, ఆ హీరోయిన్ సోనియా హారర్ సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి '7/జి'... ఇది బృందావన కాలనీ కాదు, ఆ హీరోయిన్ సోనియా హారర్ సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Mushtaq Khan Kidnapped: కిడ్నాపర్ల చేతిలో 12 గంటలు చిత్ర హింసలు అనుభవించిన బాలీవుడ్ నటుడు... చివరకు ఏమైందంటే?
కిడ్నాపర్ల చేతిలో 12 గంటలు చిత్ర హింసలు అనుభవించిన బాలీవుడ్ నటుడు... చివరకు ఏమైందంటే?
Embed widget