Mushtaq Khan Kidnapped: కిడ్నాపర్ల చేతిలో 12 గంటలు చిత్ర హింసలు అనుభవించిన బాలీవుడ్ నటుడు... చివరకు ఏమైందంటే?
ఫేక్ ఈవెంట్ పేరుతో గత నెల ప్రముఖ బాలీవుడ్ నటుడు ముస్తాక్ ఖాన్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తప్పించుకున్నట్టు సమాచారం.
ప్రముఖ బాలీవుడ్ నటుడు ముస్తాక్ ఖాన్ (Mustak Khan Actor) గత నెల కిడ్నాప్ అయ్యారు. దాదాపు 10 రోజుల పాటు కిడ్నాపర్ల చెరలో బందీగా ఉండి, చిత్రహింసలకు గురైన ఆయన తాజాగా తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది.
ఢిల్లీలో ఈవెంట్ ఉందని చెప్పి...
అసలు ఈ కిడ్నాప్ ఎలా జరిగిందంటే... నవంబర్ 20న మీరట్ లో ఒక అవార్డు కార్యక్రమానికి హాజరు కావాలని ముస్తాక్ ఖాన్ ను కొందరు సంప్రదించారు. ఆయన ఒప్పుకోవడంతో ఫ్లైట్ టికెట్లతో పాటు ఆయన ఖాతాలో అడ్వాన్స్ అమౌంట్ కూడా వేశారు. అనంతరం ఫ్లైట్ ప్రయాణం తరువాత ఢిల్లీలో దిగిన ఆయనను... సపరేట్ గా ఓ కారులో వేదిక వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. వాళ్ల మాటల్ని నమ్మిన ముస్తాక్ అలాగే కార్లో ఎక్కాడు. కానీ తీరా ఆ కార్ డ్రైవర్ అతన్ని సమీపంలోని ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ దాదాపు 12 గంటల పాటు కిడ్నాపర్లు అతడిని బందీగా ఉంచారు. అంతేకాకుండా ముస్తాక్ ను కిడ్నాపర్లు చిత్రహింసలకు గురి చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆయన ఫ్యామిలీకి ఈ విషయాన్ని తెలియజేసి, కోటి రూపాయలు ఇస్తేనే అతన్ని విడుదల చేస్తామని డిమాండ్ చేశారట. కానీ కిడ్నాపర్లు నటుడు ముస్తాక్ ఖాన్ తో పాటు, అతని కుమారుడి బ్యాంక్ ఖాతాలో నుంచి రెండు లక్షలు మాత్రమే అందుకోగలిగారట. అయితే తాజాగా ఆయన కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని రావడంతో కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఈ విషయాలన్నింటినీ ముస్తాక్ ఖాన్ బిజినెస్ పార్టనర్ శివం యాదవ్ వెల్లడించారు.
ఉదయం ఆజాన్ విన్న తర్వాత ముస్తాక్ తప్పించుకోగలిగాడని శివమ్ తెలిపారు. ఆజాన్ వినిపిస్తున్న మసీదు వైపు పరిగెత్తి, అనంతరం అక్కడ స్థానికుల హెల్ప్ తీసుకున్నాడట ముస్తాక్. ఆ తర్వాత పోలీసుల సహకారంతో ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన ఊహించని విధంగా ఇలా కిడ్నాప్ కి గురవ్వడం, ఆ తర్వాత ఇంటికి ప్రాణాలతో చేరుకోవడంతో ఆయన కుటుంబం ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇంటికి చేరుకున్న తర్వాత ముస్తాక్ ఖాన్ కిడ్నాపర్లపై కేసు నమోదు చేసినట్టుగా సమాచారం. ఆయన దగ్గర ఉన్న విమాన టికెట్లు, బ్యాంకు ఖాతాలో అడ్వాన్స్ గా పడిన డబ్బు సమాచారాన్ని పోలీసులకు ఇచ్చారట. అలాగే పోలీసులు విమానాశ్రయం సమీపంలోని సిసిటీవీ ఫుటేజ్ ను ప్రూఫ్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ముస్తాక్ ఖాన్ ఆ వ్యక్తులను, అలాగే తనను దాచి ఉంచిన ఇంటిని కూడా గుర్తుపడతానని పోలీసులకు చెప్పారట.
అయితే పోలీసులు ముస్తాక్, కమెడియన్ సునీల్ పాల్ ను కిడ్నాప్ చేసిన విధానానికి చాలా పోలికలు ఉన్నట్టుగా గుర్తించారు. అది కూడా ఢిల్లీ మీరట్ హైవేలోనే జరగడం గమనార్హం. అచ్చం ముస్తాక్ లాగే సునీల్ పాల్ ని కూడా ఈవెంట్లో పర్ఫామెన్స్ ఇవ్వమని అడిగారు. ఆ తర్వాత ఫ్లైట్ టికెట్ ఇచ్చి, అడ్వాన్స్ కూడా ఆయన బ్యాంకులో వేశారు. అతన్ని 20 లక్షలు డిమాండ్ చేయగా, 6 లక్షలు ఇచ్చి విడిపించారు. సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకుని జరుగుతున్న ఈ వరుస ఘటనలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఇక ముస్తాన్ ఖాన్ విషయానికి వస్తే త్వరలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, అసలేం జరిగిందనే విషయాన్ని వివరించబోతున్నారు. రీసెంట్ గా 'స్త్రీ 2' చిత్రంలో నటించిన ఖాన్ ఇప్పుడు కోలుకుంటున్నారని సమాచారం. ఫేక్ ఈవెంట్ ఇన్విటేషన్‌ల ద్వారా సెలబ్రిటీలను టార్గెట్ చేసే గ్రూప్‌లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?