అన్వేషించండి

Ratan Tata Passes Away: రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన వ్యాపార దిగ్గజం

Ratan Tata No More | ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Ratan Tata Death News | ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ముంబైలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల కిందట ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రతన్ టాటాకు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రతన్ టాటా కన్నుమూశారు. టాటా గ్రూపు దిగ్గజ చైర్మన్ రతన్ టాటా ఇకలేరని టాటా గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది. రతన్ టాటా మరణంపై ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. టాటాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.  

టాటా సన్స్ చైర్మన్ భావోద్వేగ లేఖ

రతన్ టాటా కన్నుమూతపై టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పందించారు. ‘రతన్ నావల్ టాటాకు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నాము. టాటాలకు మాత్రమే మరెందరికో సహకారం అందించిన అసాధారణ వ్యక్తి. మన దేశం గర్వించదగ్గ అతికొద్ది మందిలో రతన్ టాటా ఒకరు. మా టాటా గ్రూప్‌కి, టాటా చైర్‌పర్సన్‌ కంటే ఆయనే ఎక్కువ. ఆయన నాకు కేవలం గురువు మాత్రమే కాదు. ఓ మార్గదర్శకుడు, మంచి స్నేహితుడు. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను.

తిరుగులేని నిబద్ధత, అంకిత భావం కారణంగా ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ ఈ స్థాయికి విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయన తనదైన ముద్రవేశారు. ఆయన సూచించిన మార్గంలో నేను నడుస్తాను. ఎన్నో లక్షల మందికి జీవితం ఇచ్చారు. చదువు నుంచి ఆరోగ్యం వరకు ఆయన చేసిన కార్యక్రమాలు అలాగే నిలిచిపోతాయి. రాబోయే తరాలు సైతం రతన్ టాటాన స్మరించుకుంటాయి. టాటా కుటుంబం తరపున, రతన్ టాటా సన్నిహితులు, ఇష్టమైన వారికి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తానని’ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఓ భావోద్వేగ లేఖను విడుదల చేశారు. 

3 దశాబ్దాల పాటు మచ్చలేని చైర్మన్‌గా రతన్ టాటా

నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు 1937 డిసెంబర్‌ 28న రతన్‌ టాటా జన్మించారు. 1991లో టాటా గ్రూపు ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా సంస్థను ఎన్నో రెట్లు అభివృద్ధి చేశారు. రెండు దశాబ్దాల అనంతరం 2012లో టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి రతన్ టాటా తప్పుకున్నారు. 1996లో టెలికమ్యూనికేషన్స్ కోసం టాటా టెలిసర్వీసెస్‌ని స్థాపించగా, 2004లో ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)గా రూపాంతరం చెంది. 2016 అక్టోబర్ నుంచి ఆరు నెలల పాటు టాటా గ్రూప్ నకు తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరించారు. దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ను 2000లో అందుకున్నారు. భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ 2008లో ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. మహారాష్ట్ర, అస్సాం ప్రభుత్వాల నుంచి పురస్కారాలు అందుకున్నారు.

Also Read: PM Modi About Ratan Tata: దూరదృష్టి ఉన్న బిజినెస్ మ్యాన్, అసాధారణ వ్యక్తి - రతన్ టాటాపై ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Phone Tapping Case Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu And Venkata Datta Sai Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
2024 Layoffs: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
Embed widget