Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Andhra Pradesh: అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలని వైసీపీ ఎమ్మెల్యేలను షర్మిల డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లబోమని జగన్ ఇప్పటికే ప్రకటించారు.
YCP MLAs to resign if they did not go to the assembly: అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైఎస్ఆర్‌సీప చీఫ్ జగన్ తీసుకున్న నిర్ణయంపై షర్మిల విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేని వారు రాజీనామా చేయాలన్నారు. జగన్ అయినా ఎమ్మెల్యేలు అయినా అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలని విజయవాడలో డిమాండ్ చేశారు.
అసెంబ్లీకి వెళ్లడం లేదని ప్రకటించిన జగన్
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆ హోదా లేకపోవడం వల్ల మాట్లాడేందుకు మైక్ ఇవ్వరని వైసీపీ చీఫ్ జగన్ అంటున్నారు. అందు వల్ల అసెంబ్లీకి వెళ్లినా ప్రయోజనం ఉండదని అందుకే తాము వెళ్లబోవడం లేదన్నారు. మీడియానే మాకు స్పీకర్ అని.. మీడియా ముదే తాము తమ వాదన వినిపిస్తామని జగన్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నంత సేపు తాము తమ వాదన మీడియా ముందు వినిపిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ కారణంగా ఆయనను ప్రధాన ప్రతిపక్ష నేతగా అర్హత సాధించలేదు. సంప్రదాయంగా పది శాతం అసెంబ్లీ సీట్లను గెల్చుకున్న వారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తారు. రెండు కన్నా ఎక్కువ పార్టీలు అలా గెల్చుకుని ఉంటే ఎక్కువ సీట్లు గెల్చుకున్న వారికి ఇస్తారు.
ప్రధాన ప్రతిపక్ష నేత ఇవ్వలేదని జగన్ అసంతృప్తి
వైసీపీకి పది శాతం అసెంబ్లీ సీట్లు రాకపోవడంతో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా సాంకేతికరంగా రాలేదు. అయితే స్పీకర్ విచక్షణాధికారం ప్రకారం ఇవ్వొచ్చు. కానీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ లోపు వైఎస్ జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపై విచారణ వాయిదా పడింది. మాములుగా అయితే ఆయన వైసీపీ పక్ష నేత జగనేనని ఆయనతి ప్రతిపక్ష పార్టీనే కాబట్టి ప్రతిపక్ష నేతేనని కాదని ఎవరూ అనడం లేదని అంటున్నారు.
అసెంబ్లీకి వైఎస్ఆర్‌సీపీ దూరం - మీడియా ముందే ప్రసంగాలు - బాధ్యతల నుంచి పారిపోయినట్లే !?
ఐదేళ్లూ అసెంబ్లీకి హాజరు కారా ?
అసెంబ్లీలో ఎన్డీఏ కూటమితో పాటు ఒక్క వైసీపీ మాత్రమే ఉంది. అందుకే మాట్లాడేందుకు సమయం వస్తుందని జగన్ అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ గత అసెంబ్లీలో జరిగిన పరిణామాలను బట్టి అసెంబ్లీకి హాజరైతే తమనూ అవమానిస్తారని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. జగన్ హాజరు కాకపోతే ఎమ్మెల్యేలను అయినా పంపితే ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లు ఉంటుందని కొంత మంది వాదిస్తున్నారు. కానీ జగన మాత్రం.. అసెంబ్లీకి హాజరయ్యేది లేదని చెబుతున్నారు. బహుశా.. ఐదేళ్ల పాటు వారు హాజరు కాకపోతే.. నిబంధనల ప్రకారం వరుసగా మూడు సెషన్లకు హాజరు కాకపోతే అనర్హతా వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది.