Pushpa 2 Music Director: ‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
Pushpa 2: ‘పుష్ప 2’ మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో లేటెస్ట్‌గా మరో వార్త బయటకు వచ్చింది. సినిమాలో వేర్వేరు పోర్షన్లకు వేర్వేరు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయనున్నట్లు తెలుస్తోంది.
Pushpa 2 Music Director Issue: ‘పుష్ప 2: ది రూల్’... మరో నెల రోజుల్లో రిలీజ్‌కు రెడీ అవుతున్న భారీ పాన్ ఇండియా సినిమా. నిజానికి ఈ సినిమా ఇప్పటికే వార్తల్లో ఉండాలి. అలాగే వార్తల్లో ఉంది కూడా... కానీ పాజిటివ్‌గా మాత్రం కాదు. ‘పుష్ప 2: ది రూల్’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో టీమ్‌లోనే డిఫరెన్సెస్ వచ్చాయన్న వార్తలు గత రెండు రోజుల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన వర్క్‌తో ఇంప్రెస్ అవ్వకపోవడంతో థమన్, ‘కాంతార’, ‘విరూపాక్ష’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్‌లతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది.
ఇద్దరు కాదు ముగ్గురా...
ఎస్ఎస్ థమన్, అజనీష్ లోకనాథ్ మాత్రమే కాకుండా శామ్ సీఎస్ కూడా ‘పుష్ప 2: ది రూల్’ కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వర్క్ డివైడ్ చేసి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లకు వేర్వేరు సీన్లు ఇచ్చారని, వారు ఇప్పుడు తమకు వచ్చిన పోర్షన్లపై వర్క్ చేస్తున్నారని సమాచారం. అవుట్ పుట్ ఎలా వచ్చిందో మాత్రం సినిమా చూస్తే కానీ చెప్పలేం.
మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే...
‘పుష్ప 2: ది రూల్’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై వర్క్ చేస్తున్న వారిలో ఎస్ఎస్ థమన్ తెలుగు వారు కాగా... అజనీష్ లోకనాథ్‌ది కర్ణాటక, శామ్ సీఎస్‌ది తమిళనాడు. వీరు ముగ్గురూ వారి ఇండస్ట్రీల్లో మంచి పేరు సంపాదించారు. ముగ్గురూ ఇప్పటి వరకు చాలా సినిమాలకు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఇలా చూసుకుంటే సినిమానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా అనే చెప్పాలి.
సాంగ్స్ అదుర్స్...
‘పుష్ప 2: ది రూల్’ నుంచి ఇప్పటి వరకు రెండు పాటలు విడుదల అయ్యాయి. ‘పుష్ప పుష్ప’, ‘సూసేకి’... ఈ రెండు పాటలూ ఛార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మిగిలిన అన్ని భాషల్లో కూడా బాగా వినిపిస్తున్నాయి. ఇంకా మరిన్ని పాటలు విడుదల కావాల్సి ఉంది. టీజర్‌కు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని ఫీడ్ బ్యాక్ వచ్చింది.
ఎందుకు వర్కవుట్ అవ్వలేదు?
‘పుష్ప 2: ది రూల్’ ఫస్టాఫ్‌ను లాక్ చేశామని నిర్మాతలు కొద్ది రోజుల ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ చేసిన ఫస్టాఫ్‌కు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన నేపథ్య సంగీతం బాలేదని హీరో అల్లు అర్జున్ ఫీలయ్యారని తెలుస్తోంది. అలాగే ఇంత పెద్ద సినిమా రిలీజ్ పెట్టుకుని దేవిశ్రీ ప్రసాద్ తన హైదరాబాద్ కాన్సెర్ట్‌కు ఎక్కువ సమయం కేటాయించడం కూడా ఐకాన్ స్టార్‌కు నచ్చలేదని తెలుస్తోంది.
టైమ్‌కు వర్క్ అవుతుందా?
మొదట ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ 12, 13 తేదీలకు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ టార్గెట్ నవంబర్ 19కి చేరిందని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ కూడా ఇంకా తీయాల్సి ఉందట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎర్లీ మార్నింగ్ సినిమాకు డబ్బింగ్ చెప్పి... తర్వాత సాంగ్ షూట్ చేసి, సాయంత్రం టాకీ పార్ట్ షూటింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం. నవంబర్ 15వ తేదీన ట్రైలర్ లాంచ్‌తో సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మరి 19 వరకు షూటింగ్ అంటే ఆ తర్వాతనే ప్రమోషన్లు అనుకోవాలి. ఇంత పెద్ద సినిమాకు కేవలం 15 రోజుల ప్రమోషన్లు సరిపోతాయో లేదో చూడాలి మరి!