అన్వేషించండి

Prabhas: ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్

Prabhas Upcoming Movies List: ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లిస్టులో మరో రెండు యాడ్ అయ్యాయి. ఆయనతో తీయబోయే సినిమాల గురించి బిగ్ అప్డేట్ ఇచ్చింది హోంబలే ఫిలిమ్స్. అది ఏమిటంటే?

బాహుబలి... భారతీయ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్ (Prabhas) హీరోగా సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆయన ఓకే అంటే ఎన్ని వందల కోట్లు అయినా బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. అటువంటి ప్రభాస్ చేత మూడు సినిమాలు చేసే అవకాశం కన్నడ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...

హోంబలేలో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు!
హోంబలే ఫిలిమ్స్ (Hombale Films)... తెలుగు ప్రేక్షకులకు ఈ కన్నడ ప్రొడక్షన్ హౌస్ కొత్త ఏమీ కాదు. కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా 'కేజిఎఫ్' తీసి పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆ తరువాత 'కాంతార', 'కేజిఎఫ్ 2' సినిమాలతో మరో రెండు భారీ విజయాలు సొంతం చేసుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' ప్రొడ్యూస్ చేసింది కూడా ఈ సంస్థే. 

ఇప్పుడు ప్రభాస్ కథానాయకుడిగా మూడు భారీ పాన్ వరల్డ్ సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయింది హోంబలే ఫిలిమ్స్ సంస్థ. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. వాళ్లిద్దరూ కలిసి 'సలార్' సీక్వెల్ చేయనున్నారు. ఆ సినిమాను హోంబలే ఫిలింస్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ మరో రెండు సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. ఆ విషయాన్ని ఇవాళ వెల్లడించారు. 2026, 2027, 2028లో ఆ మూడు సినిమాలు విడుదల అవుతాయని తెలిపారు. ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసిన వివరాల ప్రకారం 'సలార్' సీక్వెల్ 2026 (Salaar 2 Release Date)లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రభాస్ లైన్ అప్ చూస్తుంటే మామూలుగా లేదుగా!
పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న హీరోలలో ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు మరొక హీరో చేతిలో లేవని చెబితే అతిశయోక్తి కాదు. ఆయన లైన్ అప్ మామూలుగా లేదు. ఒకటంటే ఒకటి కాదు... అరడజనుకు పైగా సినిమాలో ప్రభాస్ ఓకే చేశారు.

Also Read: 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' రివ్యూ: నిఖిల్ ఎప్పుడో చేసిన సినిమా - ఇప్పుడు చూసేలా ఉందా?


'సలార్', 'కల్కి 2898 ఏడీ' విజయాలతో భారీ వసూళ్లు సాధించిన ఆయన... వచ్చే ఏడాది ఏప్రిల్ 10న 'ది రాజా సాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగా మరొక సినిమా స్టార్ట్ చేశారు ప్రభాస్. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రం చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో భారీ పోలీస్ యాక్షన్ ఫిలిం 'స్పిరిట్' స్టార్ట్ చేస్తారు. 'కల్కి' సీక్వెల్ ఎలాగో చేతిలో ఉంది. అదే విధంగా 'సలార్' సీక్వెల్ కూడా. దాని తర్వాత మరో రెండు సినిమాలు హోంబలే ఫిలింస్ లో ప్రభాస్ చేయనున్నారు.

Also Readసిటాడెల్ హనీ బన్నీ రివ్యూ: Amazon Prime Video ఓటీటీలో సమంత వెబ్ సిరీస్ - ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget