X

Penis Plant: ఈ మొక్క పేరు ‘పురుషాంగం’.. పాతికేళ్లకు ఒకసారే పూస్తుందట, ఎక్కడో తెలుసా?

ఈ మొక్క పేరు వింటే ‘ఛీ పాడు’ అనిపిస్తుంది. కానీ, దీని గురించి తెలుసుకుంటే ఔరా అనిపిస్తుంది. వాసన మాత్రం ‘ఛీ కంపు’ అనిపిస్తుంది.

FOLLOW US: 

ప్రపంచంలో మీరు ఎన్నో రకాల మొక్కలను చూసి ఉంటారు. అయితే ఈ మొక్కను మాత్రం మీరు చూసి ఉండరు. అంతేకాదు.. దాని పేరు కూడా మీరు విని ఉండరు. ఈ అరుదైన మొక్క పేరు ‘పెనిస్’. అంటే ‘పురుషాంగం’ అని అర్థం. ఈ పేరు వినగానే.. ‘‘ఛీ, పాడు ఇదేం పేరు’’ అని అనుకుంటున్నారు కదూ. అయితే, ఆ మొక్కకు పూసే పువ్వు రూపాన్ని బట్టి.. అంతా ఆ పేరుతో పిలుస్తున్నారు. అయితే, ఈ పువ్వు అన్ని సీజన్ల పూయదు. పాతికేళ్లకు ఒకసారి మాత్రమే పూస్తుంది. అందుకే, దానికంత ప్రత్యేకత. 

ఆరున్నర అడుగుల పొడవుండే ఈ ‘పెనిస్ ప్లాంట్’.. పాతికేళ్ల తర్వాత ఐరోపా గడ్డపై తొలిసారి పుష్పించింది. ఈ మొక్క శాస్త్రీయ నామం ‘అమోర్ఫోఫాలస్ డెకస్-సిల్వే’. లైడెన్ హోర్టస్ బొటానికస్‌లో ఉన్న ఈ మొక్క ఈ నెల 19న పుష్పించింది. ఇండోనేషియాలోని జావా దీవిలో ఈ పెనిస్ మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. అయితే, ఈ పువ్వు పుష్పించడం చాలా కష్టం.

పువ్వే కదా మాంచి సువాసన వస్తుందని.. వాసన చూసేందుకు మాత్రం ప్రయత్నించకండి. ఎందుకంటే.. ఈ పువ్వు నుంచి వచ్చే కంపును భరించడం చాలా కష్టం. యూరప్ దేశాల్లో ఇలాంటి మొక్కలు పెరగడం చాలా అరుదు. ఈ మొక్క చివరిసారిగా 1997లో మాత్రమే పూసింది. దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ ఈ ఏడాది వికసించింది. ఈ మొక్క పుష్పించడానికి ముందు ఆకులను తయారు చేసుకుంటుంది. దుంపలలో ఆహారాన్ని నిల్వ చేస్తుంది. పుష్పించిన తర్వాత మళ్లీ ఆకుల పెరుగుదల మళ్లీ మొదలవుతుంది.

గ్రీన్‌హౌస్ మేనేజర్ రోజియర్ వాన్ వుగ్ట్ డచ్ మీడియా ఔట్‌లెట్ ‘ఓమ్రోప్ వెస్ట్‌’తో మాట్లాడుతూ.. ‘అమోర్ఫోఫాలస్’ అంటే ‘ఆకారం లేని పురుషాంగం’ అని అర్థం. అకస్మాత్తుగా చూస్తే ఇది అంగం తరహాలోనే ఉంటుందన్నారు. వాస్తవానికి ఇది పొడవాటి కాండమని తెలిపారు. దీని వాసన కుళ్లిన మాంసం తరహాలో ఉంటుందన్నారు.

View this post on Instagram

A post shared by Hortus botanicus Leiden (@hortusleiden)Also Read: భూటాన్‌లో ఇళ్లపై అశ్లీల చిత్రాలు ఎందుకుంటాయ్? ప్రజలు అంత హ్యాపీగా ఎలా జీవిస్తున్నారు?

Tags: Penis Plant Panis Plant in Europe Rare Plant Penis Plant Blooms పెనిస్ ప్లాంట్

సంబంధిత కథనాలు

వీడియో: వరుడి ఎదుటే వధువుకు సింధూరం దిద్దిన ప్రియుడు.. పీటలపైనే కుమ్మేశారు

వీడియో: వరుడి ఎదుటే వధువుకు సింధూరం దిద్దిన ప్రియుడు.. పీటలపైనే కుమ్మేశారు

Suicide Machine: ‘ఆత్మహత్య’కు అనుమతి.. నొప్పిలేకుండా చంపే యంత్రానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Suicide Machine: ‘ఆత్మహత్య’కు అనుమతి.. నొప్పిలేకుండా చంపే యంత్రానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం

Men's Health: ‘ఏక్ మినీ కథ’.. పాపం, ఎంతో ఖర్చుపెట్టి ‘అది’ పెంచుకున్నాడు, కానీ.. ఓ యువకుడి చేదు అనుభవం

Snake in Sofa: కొత్త సోఫాలో స్నేక్ బాబు బుస బుస.. కూర్చుంటే చచ్చేవాడే!

Snake in Sofa: కొత్త సోఫాలో స్నేక్ బాబు బుస బుస.. కూర్చుంటే చచ్చేవాడే!

Chewing Gum for Corona: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు

Chewing Gum for Corona: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్...  తయారుచేసిన శాస్త్రవేత్తలు

టాప్ స్టోరీస్

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Kurnool Allagadda Faction : ఫ్యాక్షన్ గొడవల్ని ఆపేసిన రెండు శ్మశానవాటికలు ! ఆళ్లగడ్డలో కొత్త శకానికి దారి చూపుతున్న గ్రామం !

Kurnool Allagadda Faction :  ఫ్యాక్షన్ గొడవల్ని ఆపేసిన రెండు శ్మశానవాటికలు ! ఆళ్లగడ్డలో కొత్త శకానికి దారి చూపుతున్న గ్రామం !

Esha Gupta Hot Photos: ఏక్ బార్... ఏక్ బార్... అందాల అప్స‌ర‌సపై లుక్ మార్‌!

Esha Gupta Hot Photos: ఏక్ బార్... ఏక్ బార్... అందాల అప్స‌ర‌సపై లుక్ మార్‌!