(Source: ECI/ABP News/ABP Majha)
CM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే
ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అందరి కళ్లూ చంద్రబాబు – రేవంత్ మీటింగ్ మీద ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవ్వడం ఇదే మొదటి సారి కాదు కానీ.. చాలా కాలం తర్వాత.. జరుగుతున్న ఈ మీటింగ్ అవుట్ కమ్ ఏంటన్న దానిపై మాత్రం కొంత ఆసక్తి ఉంది. పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పడవుతాయా.. వీళ్లు పాజిటివ్ గా ఆలోచించినా.. రేపు వచ్చే ప్రాక్టికల్ సమస్యలను పరిష్కరించడం ఇంత ఈజీనా అని ఇలా రకరకాల అభిప్రాయాలున్నాయి. అవి అలా ఉంచితే చంద్రబాబు- రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా కూడా ఈ మీటింగ్ కు కాస్త ప్రాధాన్యం ఎక్కువే ఉంది.
ఏపీ సీఎం చంద్రబాబు – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ శనివారం సాయంత్రం ఆరింటికి ప్రజాభవన్ లో కలుస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మారి పాతిక రోజులైంది. చంద్రబాబు- రేవంత్ కు ఉన్న సంబంధాల దృష్ట్యా అయితే ఇన్ని రోజులు సమయం అన్నది ఎక్కువే అనుకోవాలి. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి.. ఇప్పటి ఆంధ్ర సీఎం చంద్రబాబు పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే. ఆ పార్టీకి తెలంగాణలో ముఖ్యమైన ఫేస్ గా నిలబడ్డ మనిషి. మారిన రాజకీయ పరిణామాల్లో రేవంత్ కొన్నేళ్ల క్రితమే కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయి అక్కడ ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. చంద్రబాబు మొన్ననే తిరుగులేని విజయంతో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ వెళ్తారన్న చర్చ కూడా నడిచింది. అయితే చంద్రబాబు అంటే ప్రస్తుతం తెలుగుదేశం నేత మాత్రమే కాదు. ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామి. అటు రేవంత్ ఇండీ కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ నేత. కాబట్టి వాళ్లిద్దరూ ముఖ్యమంత్రుల హోదాలను దాటుకుని సంబంధాలను నెరపడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే. కనీసం బహిరంగంగా ఆ పని చేయలేరు.
ఇప్పటికే రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయినా ఇంకా పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇందుకోసం ఈ దఫా చంద్రబాబు ముందుగా చొరవ తీసుకున్నారు. వారం రోజుల కిందట ఆయనే తెలంగాణ సీఎం రేవంత్‌కు ఓ లేఖ రాసి 6వతేదీన కలిసి మాట్లాడుకుందాం అని ప్రతిపాదించారు. రేవంత్ రెడ్డి దీనికి సమ్మతించడంతో ఇవాళ మీటింగ్ ఖరారు అయింది. మొత్తం 10 అంశాలపై ఈ సమావేశం జరుగుతున్నట్లు సమాచారం. టీకి ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్ ఈ భేటీలో పాల్గొంటున్నారు. రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ముఖ్య కార్యదర్శులు కూడా హాజరవుతారు.