అన్వేషించండి

Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!

Andhrapradesh News: ఏపీ ప్రభుత్వం సోమవారం నుంచి ఉచితంగా ఇసుకను అందించనుంది. చిన్న నదుల్లో ఇసుకను సామాన్యులు ఎండ్ల బండ్ల ద్వారా ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

AP Government Free Sand Scheme: ఏపీ ప్రభుత్వం  ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 8 (సోమవారం) నుంచి ఉచితంగా ఇసుకను అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేయగా.. అందుకు అనుగుణంగా జిల్లాల యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముందుగా అన్ని చోట్లా స్టాక్ ఉన్న కేంద్రాల్లో ఇసుక డంప్‌ల నుంచి ఉచితంగా ఇసుకను అందిస్తుంది. ఇందుకోసం రూపాయి కూడా చెల్లించనవసరం లేదు. అయితే, నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు రూ.20, సీనరేజ్ కింద టన్నుకు రూ.88 వసూలు చేస్తారు. నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వే బిల్లులు జారీ చేస్తారు. అదే వాగులు, వంకలు, చిన్న చిన్న నదుల్లోని ఇసుకను ఎండ్ల బండ్ల ద్వారా ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలు, అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎండ్ల బండ్ల ద్వారా మాన్యువల్‌గా ఇసుకను తరలించుకోవచ్చు. ఇప్పటివరకూ కాంట్రాక్టర్లు కొన్ని జిల్లాల్లో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్వి విక్రయించేవారు. అయితే, నూతన ప్రభుత్వ నిర్ణయంతో ఉచితంగానే ప్రజలకు ఇసుక అందనుంది. 

అక్రమ రవాణాపై నిఘా

ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం నిఘా ఉంచుతుంది. కమర్షియల్ అవసరాల కోసం ఎవరైనా లారీల్లో ఇసుకను భారీగా తరలించేందుకు యత్నిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు చేపడతారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా.. అక్రమ రవాణా జరగకుండా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఆయా జిల్లాల్లో ఇసుక నిల్వలన్నీ కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు అంచనా వేశారు. సెప్టెంబర్ వరకూ 88 లక్షల టన్నుల అవసరం ఉంటుందని, ఏడాది కాలానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. సోమవారం నుంచి ఆయా జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఎంత మేరకు ఇసుక అందుబాటులో ఉంటుందో కలెక్టర్లు ప్రకటించనున్నారు. దీన్ని ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో కలెక్టర్లు, స్థానిక ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. నిల్వ కేంద్రాల్లో ఇసుక ధర తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేస్తారు.

రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే రవాణా ఖర్చు కింద టన్నుకు, కి.మీకు రూ.4.90 పైసలు.. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు రూ.20 తీసుకోనున్నారు. వీటన్నింటికీ కలిపి 18 శాతం జీఎస్టీ వేస్తారు. స్టాక్ పాయింట్లలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అక్కడ ఇసుక ఎంతనేది కలెక్టర్లు నిర్ణయిస్తారు. కాగా, ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో బోట్స్‌మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక టన్నుకు రూ.225 చొప్పున తీసుకోనున్నారు.

అధికారిక పోర్టల్

అయితే, ఉచిత ఇసుకకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ.. అధికారిక పోర్టల్ మాత్రం సిద్ధంగా ఉంది. https://www.mines.ap.gov.in/miningportal/ సైట్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఇందులోనే దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు. ఉచిత ఇసుకకు సంబంధించిన పూర్తి వివరాలు సైతం ఇందులో ఉంటాయని తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు కావడంపై భవన నిర్మాణ కార్మికులు, గుత్తేదారులు, సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ వ్యయం తగ్గుతుందని.. తమకు ఉపాధి లభిస్తుందని కార్మికులు చెబుతున్నారు.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Polls: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
స్థానిక పోరులో మొదలైన రచ్చ.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
Vijayawada Woman Arrest: ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Embed widget