Gut Health: పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రీబయోటిక్ ఆహారాలు ఇవే
పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొ బయోటిక్స్, ప్రీబయోటిక్స్ రెండూ చాలా ముఖ్యం.
ప్రీబయోటిక్స్ మొక్కల్లో తరచుగా కనిపించే కొన్ని రకాల ఫైబర్, పేగులకి ఆరోగ్యాన్ని ఇయందించే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలని ప్రోత్సహిస్తాయి. పొట్ట ఆరోగ్యానికి ఇవి చాలా అవసరం. వీటిని తినడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రీబయోటిక్ ఎటువంటి ఆహారాల్లో ఎక్కువగా ఉంటుందో పరిశోధకులు గుర్తించారు. డాండెలిన్ ఆకుకూరలు, వెల్లుల్లి, లీక్స్, ఉల్లిపాయల్లోని ఏదైనా ఆహారంలో అత్యధికంగా ప్రీబయోటిక్ కంటెంట్ ఉందని అధ్యయనం కనుగొంది. ప్రీబయోటిక్ ఫుడ్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ గట్ సూక్ష్మజీవులకి మద్దతు ఇస్తుంది.
ప్రీబయోటిక్ ఆహారం తినడం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే ఎక్కువ ఫైబర్ తినేటప్పుడు మైక్రోబయోమ్ కి మద్దతు ఇస్తుంది. పేగుల్లో మంచి సూక్ష్మజీవులకు ఆహారం ప్రీబయోటిక్స్ ఉపయోగపడతాయి. ఇక ప్రత్యక్ష సూక్ష్మ జీవులని కలిగి ఉన్న ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి రెండూ మైక్రోబయోమ్ లు ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ, కాల్షియం వంటి ఖనిజాలని బాగా గ్రహించడం, జీర్ణయాకిరీ మెరుగుపరచడం, రోగనిరోధక శక్తి పనితీరు చక్కగా ఉండాలంటే ప్రీ బయోటిక్ తీసుకోవడం చాలా అవసరమని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ సైంటిఫిక్ అసోసియేషన్ ఫర్ ప్రొబయోటిక్స్, అండ్ ప్రీబయోటిక్స్ చెప్పిన దాని ప్రకారం రోజుకి కనీసం 5 గ్రాములు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.
ప్రీబయోటిక్ ఆహారాలు..
డైటరీ స్టడీస్ కోసం ఫుడ్ అండ్ న్యూట్రియంట్ డేటా బేస్ లో ఉన్న 8,690 ఆహారాల ప్రీబయోటిక్ కంటెంట్ విశ్లేషించడానికి పరిశోధకులు గతంలో ప్రచురించిన శాస్త్రీయ ఆధారాలని పరిశీలించారు. డేటా బేస్ లోని 37 శాతం ఆహారాల్లో ప్రీబయోటిక్స్ ఉన్నట్టు గుర్తించారు. డాండెలైన్ ఆకుకూరలు, జెరూసలేం ఆర్టిచోక్, వెల్లుల్లి, లీక్స్, ఉల్లిపాయల్లో అత్యధిక మొత్తంలో ప్రీబయోటిక్స్ ఉన్నాయి. ప్రతి గ్రాము ఆహారానికి(mg/g) 100-240 మిల్లీ గ్రాముల ప్రీబయోటిక్స్ వరకు ఉంటాయి. ఇతర ప్రొబయోటిక్ రిచ్ ఫుడ్స్ లో ఉల్లిపాయ, కౌపీస్, ఆస్పరాగస్, కెల్లాగ్స్ ఆన్ బ్రాన్ తృణధాన్యాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి 50-60 mg/g ఉంటుంది. ఉల్లిపాయలు భారతీయ గృహాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. మంచి సువాసన కలిగిన ఉల్లిపాయలో ప్రీబయోటిక్స్ ఉన్నాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇలా
కూరగాయలు, పండ్లు, చిక్కుళ్ళు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, ప్రొ బయోటిక్స్ ఉన్న ఆహారం పెరుగు, ఆలివ్, మజ్జిగ, కాటేజ్ చీజ్ వంటివి తీసుకుంటే గట్ ఆరోగ్యం బలపడుతుంది. ఈ ఆహారాలు మెనూలో ఉండేలా చూసుకోవాలి. పేగుల ఆరోగ్యం బాగుంటేనే మెదడు సరిగా పని చేస్తుందని ఇటీవలే ఒక అధ్యయనం వెల్లడించింది. పేలవమైన ఆహారం, దీర్ఘకాలిక ఒత్తిడి ఫలితంగా తరచుగా సంభవించే గట్ మైక్రోబయోమ్ లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మెదడు పనీతిరుకి అంతరాయం కలిగిస్తుంది. ఒత్తిడి వల్ల పొత్తి కడుపు తిమ్మిరి, పైల్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఈ కిచెన్ రెమిడీస్ తో డార్క్ సర్కిల్స్ సింపుల్ గా తొలగించుకోవచ్చు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial