Dark Circles: ఈ కిచెన్ రెమిడీస్ తో డార్క్ సర్కిల్స్ సింపుల్ గా తొలగించుకోవచ్చు
కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గించుకునేందుకు పార్లర్ కి వెళ్ళి తిప్పలు పడాల్సిన పని లేదు. ఇంట్లోనే సింపుల్ గా పోగొట్టుకోవచ్చు.
అమ్మాయిలు నిద్రలేచే సరికి కళ్ల కింద నల్లటి వలయాలు కనిపించాయంటే చాలు తెగ హైరానా పడిపోతుంటారు. అవి కనిపించకుండా ఉండటం కోసం కాసింత మేకప్ ఎక్కువ కొట్టేస్తారు. అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా కళ్ల కింద వచ్చే డార్క్ సర్కిల్స్ తొలగించుకోవచ్చు. నిద్రలేమి, ఒత్తిడి, డీహైడ్రేషన్ వంటి అనేక కారణాల వల్ల ఇవి వస్తాయి. కిచెన్ రెమిడీస్ తో వాటిని పూర్తిగా తొలగించలేకపోయినా వాటి రూపాన్ని తగ్గించుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సింది ఇవే..
దోసకాయ ముక్కలు
కళ్ళు మూసుకుని కాసేపు వాటి మీద దోసకాయ ముక్కలు పెట్టుకోండి. ఇవి మీ కళ్లని శాంతపరుస్తాయి. సుమారు 10-15 నిమిషాల పాటు వాటిని అలాగే ఉంచుకోవాలి. చర్మం ఉబ్బడం తగ్గిస్తుంది. కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది.
బంగాళాదుంప ముక్కలు
దోసకాయ మాదిరిగానే కళ్ళపై బంగాళాదుంప ముక్కలు ఉంచుకోవచ్చు. లేదంటే దాని నుంచి రసాన్ని తీసి కళ్ల చుట్టు రాసుకోవచ్చు. 10-15 నిమిషాల పాటు ఉంచుకుని ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.
టొమాటో జ్యూస్
ఒక టీ స్పూన్ టొమాటో రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని డార్క్ సర్కిల్స్ ఉన్న ప్లేస్ లో అప్లై చేసుకోవాలి. ఒక పది నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచుకుని ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కని ఫలితం చూస్తారు. టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.
గ్రీన్ టీ బ్యాగ్
రెండు గ్రీన్ టీ బ్యాగ్ లని వేడి నీటిలో వేసి కొన్ని నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత వాటిని చల్లబడే వరకు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. చల్లబడిన టీ బ్యాగ్ ని కళ్ళ మీద పెట్టుకోవాలి. 15 నిమిషాల పాటు వాటిని అలాగే ఉంచితే హాయిగా ఉంటుంది.
పాలు, పసుపు పేస్ట్
ఒక చిటికెడు పసుపు కొన్ని చుక్కల పాలు కలుపుకుని పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. దీన్ని డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని క్లీన్ చేసుకోవాలి. పాలు చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయి.
బాదం నూనె
నిద్రపోయే ముందు కళ్ల చుట్టూ కొన్ని చుక్కల బాదం నూనె రాసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. బాదం నూనెలో విటమిన్లు ఇ, కే ఉన్నాయి. ఇవి కాలక్రమేణా నల్లటి వలయాలని తగ్గించడానికి సహాయపడతాయి.
రోజ్ వాటర్
కొద్దిగా దూది తీసుకుని రోజ్ వాటర్ లో నానబెట్టాలి. వాటిని కళ్ల మీద 10-15 నిమిషాలు ఉంచుకోవాలి. రోజ్ వాటర్ లో చర్మానికి మేలు చేసే గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని రీఫ్రెష్ చేయడంలో మెరుగ్గా పని చేస్తుంది.
కోల్డ్ మిల్క్ కంప్రెస్
కాటన్ ప్యాడ్ ని చల్లటి పాలలో నానబెట్టి వాటిని 10-15 నిమిషాలు ఉంచుకోవాలి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేసి ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఈ కాఫీ వల్ల మతిమరుపు తగ్గిపోతుంది!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial