అన్వేషించండి

PM Modi Birthday : నరేంద్ర మోదీ 75వ బర్త్ డే స్పెషల్.. ప్రధానమంతిగా మోదీ శాలరీ ఎంత? మొత్తం ఆస్తుల వివరాలు ఇవే

PM Modi Salary : ప్రధాని నరేంద్ర మోదీకి నెలకి ఎంత జీతం వస్తుంది? ఆయనకున్న ఆస్తులు ఎంత? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మోదీ పుట్టిన రోజు సందర్భంగా తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) భారత రాజకీయాలలో అత్యంత ప్రభావవంతమైన, ప్రజాదరణ పొందిన నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఈరోజు అంటే సెప్టెంబర్ 17వ తేదీన 2025లో ఆయన తన 75(Modi 75th Birthday)వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి దేశంలోని అత్యున్నత రాజకీయ పదవికి ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అందుకే ప్రజలు.. ముఖ్యంగా యూత్​ మోదీని చాలా ఇష్టపడతారు. అందుకే ఆయన గురించిన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈరోజు మోదీ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన జీతం, ఆస్తుల గురించి తెలుసుకుందాం.  

ప్రధాని మోదీకి ఎంత జీతం వస్తుంది? (PM Modi Salary)

భారతదేశం ప్రధానమంత్రిగా పనిచేస్తున్న నరేంద్ర మోదీకి ప్రతి నెలా దాదాపు 1.66 లక్షల రూపాయల జీతం అందుతుంది. ఇందులో పార్లమెంటరీ అలవెన్స్, వ్యయ అలవెన్స్, రోజువారీ అలవెన్స్, ప్రాథమిక వేతనం కూడా ఉంటాయి. దీని ప్రకారం.. మోదీ 45,000 రూపాయలు పార్లమెంటరీ అలవెన్స్​గా, 3,000 రూపాయలు వ్యయ అలవెన్స్​గా, 2,000 రూపాయలు రోజువారీ అలవెన్స్​గా, 50,000 రూపాయలు ప్రాథమిక వేతనంగా పొందుతున్నారు. అలా చూస్తే ప్రధాని మోదీ జీతం కేవలం 50,000 రూపాయలు మాత్రమే. అయితే మీకు తెలుసా? మోదీ తన పూర్తి జీతాన్ని వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారట. అందుకే నరేంద్ర మోదీ తన జీతాన్ని ప్రధానమంత్రి సహాయ నిధి (PM రిలీఫ్ ఫండ్)కి విరాళంగా ఇస్తారు. దీని లక్ష్యం దేశంలోని పేద ప్రజలకు సహాయం చేయడమే.

ప్రధాని మోదీ ఆస్తులు (PM Modi Assets)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తి గత 18 సంవత్సరాలలో చాలా పరిమితంగా పెరిగింది. 2007లో అతని ఆస్తి మొత్తం 42.56 లక్షల రూపాయలు. 2012లో ఇది 1.33 కోట్ల రూపాయలకు పెరిగింది. 2014లో 1.26 కోట్ల రూపాయల ఆస్తితో ఉన్నారు. 2017లో మోదీ ఆస్తి మొత్తం 2.00 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2024లో అతని ఆస్తి 3.02 కోట్ల రూపాయలకు పెరిగింది.

ప్రధాని మోదీ దగ్గరున్న నగదు ఎంత?

ప్రధాని మోదీ వద్ద మొత్తం నగదు 52,920 రూపాయలు మాత్రమే ఉంది. దీనితో పాటు.. ఆయనకు భూమి లేదా ఇల్లు వంటి ఆస్తి లేదు. అలాగే, ఆయనపై ఎటువంటి రుణం లేదా బాధ్యత లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని ఆదాయపు పన్ను రిటర్న్స్​లో ఏ విధంగా నమోదు చేశారంటే...

  • 2018-2019 సంవత్సరంలో అతని ఆదాయం 11.14 లక్షల రూపాయలు.
  • 2019-2020 లో ఆదాయం 17.20 లక్షల రూపాయలకు పెరిగింది.
  • 2020-2021 లో ఆదాయం 17.07 లక్షల రూపాయలుగా నమోదైంది.
  • 2021-2022 లో ఆదాయం తగ్గి 15.41 లక్షల రూపాయలకు చేరుకుంది.
  • 2022-2023 లో ఆదాయం మళ్లీ పెరిగి 23.56 లక్షల రూపాయలుగా నమోదైంది.

ఆస్తి పరంగా ప్రధాని మోదీకి ఇంకేమున్నాయి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద మొత్తం 50 వేలకు పైగా డబ్బు నగదు రూపంలో ఉన్నాయి. దీనితో పాటు ఆయన ఎస్‌బిఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, దానిపై వడ్డీతో కలిపి దాదాపు 2.85 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎస్బిఐలో అతని అదనపు డిపాజిట్ 80,304 రూపాయలు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో వడ్డీతో కలిపి మోదీ డిపాజిట్ 9.12 లక్షల రూపాయలు. ఆయన వద్ద ఉన్న ఆభరణాలలో బంగారు ఉంగరం విలువ 2.67 లక్షల రూపాయలు. దీనితో పాటు.. ఇతర ఆస్తులలో క్లెయిమ్స్, వడ్డీల విలువ 3.33 లక్షల రూపాయలుగా ఉందని నివేదికలు చెప్తున్నాయి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget