దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతవరకు చదివారో తెలుసా?



మోదీ గురించి ఇండియాలో తెలియని వారు ఉండరు. ఎక్కడికి వెళ్లినా ఆయన తనదైన ముద్ర వేస్తారు.



దాదాపు అందరికీ ఆయన రాజకీయ ప్రయాణం గురించి తెలుసు.. కానీ వారి విద్య గురించి తెలుసా?



ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంత చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారో చూసేద్దాం.



మోదీ 1967లో వడ్నగర్లో తన ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు.



బాల్యంలో తన తండ్రికి టీ అమ్మడంలో సహాయం చేసి.. సొంతంగా టీ స్టాల్ కూడా నడిపారు.



1978లో మోదీ రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.



1983లో ఆయన రాజకీయ శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.



నేడు ప్రధానిగా మోదీ దేశాన్ని చూసుకుంటున్నారు.



గుజరాతీ కుటుంబంలో వడ్నగర్లో జన్మించిన ఆయన మూడు సార్లు పీఎం అయ్యారు.