అన్వేషించండి

CIBIL Score : హోమ్ లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? తగ్గితే మెరుగుపరిచే 5 మార్గాలు ఇవే

CIBIL Score for House Loan : ఇళ్లు కొనుక్కోవాలని.. దాని కోసం హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ సిబిల్ స్కోర్ ఎంత ఉండాలో తెలుసా? మంచి సిబిల్​ స్కోర్ కోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సిబిల్ స్కోర్ క్రెడిట్ విశ్వసనీయతను, రుణ అర్హతను నిర్ణయిస్తుంది.
  • 750 పైన స్కోర్ రుణాలు, క్రెడిట్ కార్డులు సులభతరం చేస్తుంది.
  • EMIలు, క్రెడిట్ బిల్లులు సకాలంలో చెల్లించడం ముఖ్యం.
  • రుణాల మధ్య సమతుల్యత, క్రమమైన రిపోర్ట్ తనిఖీ మేలుచేస్తుంది.

CIBIL Score for Home Loan : మీరు ఇళ్లు కొనుక్కోవడానికి లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే.. వాళ్లు ముందుగా మీ సిబిల్ స్కోర్‌ చెక్ చేస్తారు. గృహ రుణం కోసం మంచి సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉండి.. మీ గృహ రుణం క్యాన్సిల్ అయితే.. దానిని వీలైనంత త్వరగా ఎలా మెరుగుపరచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

సిబిల్ స్కోర్ అంటే..

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (CIBIL) దేశంలోనే మొట్టమొదటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ. ఇది క్రెడిట్ కార్డ్, రుణాల తిరిగి చెల్లింపుల రికార్డులను సేకరించి.. నిర్వహించడమే దీని పని. వీటి ఆధారంగా ఈ సంస్థ ఒక వ్యక్తికి సంబంధించిన సిబిల్ స్కోర్‌ను కేటాయిస్తుంది. సిబిల్ స్కోర్ అనేది మీ రుణ తిరిగి చెల్లింపు చరిత్రను ప్రతిబింబించే 3-అంకెల సంఖ్య. ఈ సంఖ్య డబ్బును అప్పుగా తీసుకోవడంలో, తిరిగి చెల్లించడంలో మీ విశ్వసనీయతను సూచిస్తుంది. అందుకే బ్యాంకులు, ఇతర సంస్థలు రుణం లేదా క్రెడిట్ కార్డ్ మంజూరు చేసే ముందు ఈ స్కోర్‌ను చెక్ చేస్తాయి. 

సిబిల్ స్కోర్ ఎంత ఉంటే మంచిది?

సిబిల్ స్కోర్ ఎల్లప్పుడూ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌ను అద్భుతమైనదిగా పరిగణిస్తారు.  ఇది రుణం లేదా క్రెడిట్ కార్డ్ పొందడాన్ని సులభతరం చేస్తుందని గమనించాలి. 650 కంటే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులు రుణాలు తీసుకునేప్పుడు, క్రెడిట్ కార్డు తీసుకునేప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి.

సిబిల్ స్కోర్ మెరుగుపరిచే అంశాలు..

మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచుకోవాలనుకుంటే.. ఇక్కడ 5 మార్గాలు ఉన్నాయి. అన్నిటికంటే ముందుగా.. మీరు ఇప్పటికే ఏదైనా రుణం తీసుకుంటే దాని EMIని సకాలంలో చెల్లించండి. వీటి చెల్లింపులో ఏ మాత్రం ఆలస్యం జరిగినా అది మీ సిబిల్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచుకోవడానికి ఇది అత్యంత ముఖ్యమైన విషయం. 

క్రెడిట్ హంగర్..

చాలా మంది తక్కువ వ్యవధిలోనే పదేపదే రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటారు. దీనివల్ల ఆ వ్యక్తికి డబ్బు అత్యవసరమని.. కేవలం రుణాలపైనే ఆధారపడి ఉన్నాడని బ్యాంకు భావిస్తుంది. దీనినే క్రెడిట్ హంగర్ అంటారు. ఈ అలవాటు మీ సిబిల్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. అందువల్ల మీరు అవసరం లేకుండా పదేపదే రుణాలు లేదా కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని నివారించాలి.

క్రెడిట్ బిల్స్..

మీ క్రెడిట్ కార్డ్ బిల్లులను ఎల్లప్పుడూ సమయానికి చెల్లించండి. క్రెడిట్ కార్డ్ వాడకం మీ సిబిల్ స్కోర్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మీ క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి చెల్లించేలా చూసుకోండి. దీనివల్ల ఎక్కువ కట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే సమతుల్యమైన సిబిల్ స్కోర్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. 

బ్యాలెన్స్ అవసరం..

గృహ రుణాలు, కార్ లోన్‌ల వంటి సురక్షిత రుణాలకు.. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్‌ల వంటి అసురక్షిత రుణాలకు మధ్య సమతుల్యతను పాటించడం అవసరం. కేవలం వ్యక్తిగత రుణాలు లేదా కార్డ్‌లపై మాత్రమే ఆధారపడటం ఆదర్శంగా ఉండదు. రెండింటిలోనూ సమతుల్యతను పాటించడం మెరుగైన క్రెడిట్ స్కోర్‌కు దోహదం చేస్తుంది. మీరు నిజంగా మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవాలనుకుంటే.. సంవత్సరానికి కనీసం రెండుసార్లు మీ క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేసుకోండి. మీ పేరు మీద ఏవైనా మోసపూరిత రుణాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఒకవేళ ఉంటే.. మీరు వాటిని వెంటనే సరిదిద్దుకోవచ్చు.

మీరు మీ సిబిల్ స్కోర్‌ను స్వయంగా కూడా తనిఖీ చేసుకోవచ్చు. దీనికోసం సిబిల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. ఉచిత సిబిల్ స్కోర్, నివేదికలను పొందవచ్చు. Get Free CIBIL Score And Reports పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ పేరు, ఇమెయిల్, పుట్టిన తేదీ, నంబర్, పాన్ నంబర్ నింపడం ద్వారా మీ సిబిల్ స్కోర్ గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు.

ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget