అన్వేషించండి

Second Hand AC Buying Tips : సెకండ్ హ్యాండ్ ఏసీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు అస్సలు లైట్ తీసుకోకండి

Second Hand AC : ఖర్చు తగ్గుతుందని సెకండ్ హ్యాండ్ ఏసీ కొనుక్కుంటున్నారా? అయితే ముందుగా మీరు ఈ విషయాలు తెలుసుకోండి. లేదంటే ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఎక్కువగా నష్టపోతారు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వాడిన ఏసీ కొనే ముందు కాలిన వాసన, వైరింగ్ లోపాలు చూసుకోండి.
  • కంప్రెసర్, మోటార్ శబ్దాలు, కూలింగ్ సామర్థ్యాన్ని పరీక్షించడం ముఖ్యం.
  • ఏసీ వయస్సు, చివరి సర్వీసింగ్ వివరాలు తెలుసుకుని కొనండి.
  • సందేహం ఉంటే నమ్మకమైన టెక్నీషియన్‌తో ఏసీని తనిఖీ చేయించండి.

Second Hand AC Buying : తెలుగు రాష్ట్రాల్లో వేడి బాగా పెరిగిపోతుంది. పైగా ఈవారం ఎండ మరింత ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ కూడా హెచ్చరిచ్చింది. ఇలా వేడి పెరిగేకొద్దీ.. ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. వేడిన భరించలేక.. డబ్బుని కూడా ఆదా చేసుకోవాలనుకునేవారు సెకండ్ హ్యాండ్ లేదా వాడిన ఏసీని కొనడమే మంచి ఎంపికగా భావిస్తారు. తక్కువ ఖర్చులో ఈ సమ్మర్​ని గడిపేద్దాం అనుకుంటారు. మీరు కూడా అలాంటి యోచనలో ఉంటే జాగ్రత్త. ముందుగా విషయాలు తెలుసుకోండి. లేకుంటే డబ్బుతో పాటు ఏసీ కూడా వేస్ట్ అయిపోతుంది. 

సెకండ్ హ్యాండ్​లో ఏసీ కొనేప్పుడు తక్కువ కాస్ట్​లో వస్తుంది కాబట్టి అది మీకు మనీసేవింగ్​గా అనిపించవచ్చు. కానీ సరిగ్గా చెక్ చేసుకోకుండా పాత ఏసీని కొంటే మీ జేబుకే కాకుండా.. ఆరోగ్యం, భద్రతకు కూడా తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని అంటున్నారు ఎక్స్​పర్ట్స్. ఎందుకుంటే వైరింగ్​లో ప్రాబ్లమ్ ఉన్నా.. గ్యాస్ లీకులు లేదా దుమ్ము పేరుకుపోవడం వంటివి తరచుగా తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తాయి. అందుకే వాడిన ఏసీని కొనే ముందు కొన్ని ముఖ్యమైన సంకేతాల గురించి తెలుసుకోవాలి అంటున్నారు.

కాలిన వాసన వస్తే..

మీరు ఏసీని ఆన్ చేసినప్పుడు వింత వాసన, కాలిపోతున్న వాసన, లేదా కెమికల్ స్మెల్ వస్తే.. అది ప్రమాదానికి సంకేతం కావచ్చు. చాలా పాత ఏసీల నుంచి రిఫ్రిజెరెంట్ గ్యాస్ లీక్ అవుతుంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు రావచ్చు. అటువంటి గ్యాస్‌కు ఎక్కువసేపు ఉంటే ఆరోగ్యానికి హానికరం. అందువల్ల కొనుగోలు చేసే ముందు.. ఏసీని కనీసం 15-20 నిమిషాల చెక్ చేసుకోవాలి.

వైరింగ్ లోపం..

పాత ఏసీలలో అతిపెద్ద ప్రమాదం ఏంటంటే వైరింగ్. కొన్ని ఏసీల్లో వైర్లు చిరిగిపోయి ఉంటాయి. లేదా ప్లగ్‌లు కాలిపోయినట్లు కనిపిస్తాయి. దీనివల్ల షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం పెరుగుతుంది. ఏసీ వెనుక ఉన్న వైరింగ్ చాలా పాతదిగా లేదా టేపుతో అతికించినట్లుగా కనిపిస్తే.. అటువంటి మోడల్‌ను కొనకపోవడమే మంచిది.

సౌండ్స్ వస్తే..

మీ ఏసీ ఆన్ చేసినప్పుడు పెద్దగా సౌండ్స్, గడగడ శబ్దాలు వస్తుంటే.. దాని లోపల ఉన్న కంప్రెసర్ లేదా మోటార్ పాడై ఉండవచ్చు. పాడైన కంప్రెసర్ ఎక్కువ విద్యుత్‌ను వినియోగించడమే కాకుండా.. అకస్మాత్తుగా పాడైపోయి నష్టాన్ని కూడా కలిగిస్తుంది. అటువంటి ఏసీని కొనడం వల్ల భవిష్యత్తులో భారీ ఖర్చులు రావొచ్చు.

కూలింగ్ చెక్..

చాలా మంది తక్కువ ధరకే దొరుకుతున్నాయని పాత ఏసీలను కొంటారు. కానీ వాటి కూలింగ్‌ను చెక్ చేయరు. అవి ఆన్ చేసిన చాలా సేపు తర్వాత కూడా ఏసీ గదిని సరిగ్గా కూల్ చేయవు. దీనివల్ల గ్యాస్, కంప్రెసర్ లేదా ఫిల్టర్‌లో సమస్య రావచ్చు. కూలింగ్ లేని ఏసీ విద్యుత్ బిల్లులను కూడా పెంచుతుంది. అలాగే ఓవర్‌లోడ్‌లో పనిచేస్తుంది.

ఎన్ని ఇయర్స్ వాడారో..

వాడిన ఏసీని కొనుగోలు చేసేటప్పుడు.. దాని వయస్సు గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. 7-8 సంవత్సరాల కంటే పాత మోడళ్లలో సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏసీకి చివరిసారిగా ఎప్పుడు సర్వీస్ చేయించారో కూడా కనుక్కోండి. యజమాని సర్వీస్ రికార్డులు ఇవ్వడానికి నిరాకరిస్తుంటే.. తీసుకోకపోవడమే మంచిది. 

టెక్నీషియన్ సపోర్ట్..

మీకు ఇవేమి తెలియదు అనుకుంటే.. సెకండ్ హ్యాండ్ ఏసీ కొనాలనుకున్నప్పుడు మీకు నమ్మకమైన టెక్నీషియన్‌ తీసుకెళ్లండి.  వారితో పూర్తిగా చెక్ చేయించుకుని అప్పుడు కొనుక్కోవచ్చు. డబ్బు ఆదా చేద్దామని.. సరిగ్గా చెక్ చేసుకోకుండా పాడైన ఏసీని కొనడం ఆర్థికంగా, ఆరోగ్యానికి కూడా వేస్ట్​ అని తెలుసుకోండి. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టైల్ స్టోరీల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget