Beauty Tips : పర్మినెంట్ మేకప్ చేయించుకోవాలనుకుంటున్నారా? దీనివల్ల లాభమా? నష్టమా? నిపుణుల సలహాలు ఇవే
Permanent Makeup : మేకప్ రొటీన్లో భాగమైపోయిన ఈ రోజుల్లో.. తమ లుక్స్‌ని మరింత పెంచుకునేందుకు పర్మినెంట్ మేకప్‌ను చాలామంది ఆశ్రయిస్తున్నారు. ఇది ఎంత వరకు మంచిది? దీంతో లాభమా? నష్టమా?

Permanent Makeup Risks in Telugu : సోషల్ మీడియా పెరిగిన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిల్లో గుడ్ లుకింగ్ కాన్సెప్ట్ బాగా పెరిగింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. ఆడవారే కాకుండా మగవారు కూడా బాగా కనిపించేందుకు మేకప్ ఫాలో అవుతున్నారు. మేకప్ లేని సమయంలో కూడా అందంగా కనిపించాలనే ఉద్దేశంతో పర్మినెంట్ మేకప్ చేయించుకుంటున్నారు. ఈ కాస్మెటిక్ టాటూయింగ్ కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది అంటున్నారు నిపుణులు.
పర్మినెంట్ మేకప్ అనేది ఎలాంటి శ్రమ లేకుండా అందంగా చూపించగలిగే వాటిలో ఒకటిగా ఉంది. ఎక్కువమంది దీనిని కనుబొమ్మలు మంచిగా కనిపించాలని.. పెదాలు ఎర్రగా ఉండాలని వీటికే చేయించుకుంటూ ఉంటారు. అసలు ఇది ఎంత వరకు మంచిది. దీనివల్ల లాభమా? నష్టమా? నిపుణులు ఏమంటున్నారు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పర్మినెంట్ మేకప్..
చేతులమీద టాటూ ఎలా వేయించుకుంటామో.. అలాగే పిగ్మెంట్ను కనుబొమ్మలు, పెదాలపై టింట్కోసం చేస్తారు. ఈ పర్మినెంట్ మేకప్ లుక్ కోసం మీరు సరైన డాక్టర్స్‌ని ఎంచుకోకుంటే తీవ్రనష్టాలు జరుగుతాయని చెప్తున్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ పూజా రెడ్డి. " మన చర్మంలో మూడు లేయర్లు ఉంటాయి. ఎపిడెర్మిస్, డెర్మిస్, సబ్క్యూటిస్ ఉంటాయి. ఈ పిగ్మెంట్ అనేది ఎపిడెర్మిస్ లెవెల్లో ఉన్నంత వరకు ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మీరు కోరుకున్నట్లే మంచి కలర్, లుక్ ఇస్తుంది. అది డెర్మిస్లోపలికి వెళ్తే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది" అని తెలిపారు.
పర్మినెంట్ మేకప్ వల్ల కలిగే లాభాలు
పర్మినెంట్ మేకప్ వల్ల వల్ల టైమ్ కలిసి వస్తుంది. రిజల్ట్స్ ఎక్కువ కాలం ఉంటాయి. అలాగే చెరిగిపోతుందనో.. నీళ్లు పడ్డాయనో భయం ఉండదు. మేకప్ అలెర్జీలు ఉండేవారికి ఇది మంచి ఆప్షన్. అంతేకాకుండా మేకప్ లేకున్న మంచి లుక్స్ మీ సొంతమవుతాయి.
పర్మినెంట్ మేకప్‌తో కలిగే నష్టాలు
ఈ బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకుంటే ముందు నొప్పి, వాపు, ఉంటాయి. కొందరిలో పిగ్మంట్ అలెర్జీ కూడా వస్తుంది. సరైన పద్ధతిలో పర్మనెంట్ మేకప్ చేయించుకోకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొందరిలో కలర్ ఫేడ్ అయిపోతుంది. పైగా ఇది ఖర్చుతో కూడినది. ఆ పిగ్మెంట్ వద్దనుకుంటే ఉన్నా తీయడం కూడా కష్టమవుతుంది.
గుర్తించుకోవాల్సిన విషయాలు
పర్మినెంట్ మేకప్ కోసం చూస్తే కచ్చితంగా ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే పర్మినెంట్ మేకప్‌లో భాగంగా ఉపయోగించే పిగ్మెంట్ ఎపిడెర్మిస్ లోపలి నుంచి డెర్మిస్‌ను చేరుకుంటే.. అది బ్లాక్, బ్రౌన్ కలర్ కాకుండా బ్లూ కలర్లోకి మారిపోతుంది. దానిని తర్వాత చికిత్సతో దూరం చేసుకోవడం చాలా కష్టం. ఎలాంటి క్రీమ్‌లు కూడా వాటికి అందుబాటులో ఉండవని తెలిపారు.
లేజర్స్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుందని తెలిపారు. కాబట్టి ఇలాంటిది ఎంచుకునేప్పుడు ఇది మీకు ఎంతవరకు అవసరం.. వైద్యులు సరైనవారా? కాదా? అనేవి క్రాస్ చెక్ చేసుకుని ట్రై చేయాలని సూచిస్తున్నారు. అలాగే పర్మనెంట్ మేకప్ చేయించుకున్న తర్వాత నీటికి, ఎండకి దూరంగా ఉండాలి. అలాగే నొప్పిని తగ్గించే ఆయింట్మెంట్స్ వాడితే మంచిది.






















