అన్వేషించండి

Positive Energy Tips : ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే నెగిటివ్ ఎనర్జీ దూరం.. రోజంతా పాజిటివ్​గా ఉండొచ్చు

Positive Energy : ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని పనులు చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుందట. అవేంటో.. వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tips to Goodbye Negativity : ఉదయాన్నే నిద్రలేవడాన్ని ఆయుర్వేదంలో చాలా ప్రయోజనకరంగా చెప్తారు. రోజు ఎలా మొదలవుతుందో.. రోజంతా అలాగే ఉంటుందని చెప్తారు. అందుకే ఉదయాన్నే కొన్ని సానుకూలమైన పనులు చేయాలంటున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో, ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీపోతుందని భావిస్తారు. 

రాత్రి నిద్ర తర్వాతే ఉదయం నిద్ర లేచిన వెంటనే సానుకూలంగా రోజు ప్రారంభించాలనుకుంటే కొన్ని అలవాట్లు నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయట. మరి రోజును పాజిటివ్​గా మార్చుకోవడానికి చేయాల్సిన 5 పనులు ఏంటో.. వాటిని చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎలా పోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

భూమాతకి నమస్కారం..

ఉదయం లేచిన తర్వాత చేతులు జోడించి భూమాతను మంచి రోజు కోసం ప్రార్థించాలి. భూమిపై కాలు పెట్టడానికి ముందు భూమాతకు గౌరవం ఇవ్వడం వల్ల శుభం జరుగుతుందని నమ్ముతారు. ఇది శాస్త్రాలలో కూడా ఈ ప్రస్తావన ఉంది. అయితే శాస్త్రాలపై అంత నమ్మకముంచని వారైతే.. గ్రాటీట్యూడ్​తో నిన్నకి థ్యాంక్స్ చెప్తూ.. ఈరోజు లేచినందుకు యూనివర్స్​కి థ్యాంక్స్ చెప్పొచ్చు. 

నీటితో రోజు ప్రారంభం

ఉదయం లేచిన తర్వాత.. రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. శరీరంలోని విషపూరిత పదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. శరీరాన్ని లోపలి నుంచి శుభ్రం చేయడంతో పాటు హైడ్రేట్ చేస్తుంది. రాగిపాత్రలో నీరు అందుబాటులో లేకుంటే గోరువెచ్చని నీటిని అయినా ఓ గ్లాస్​లో తీసుకోవచ్చు. మలాసనలో కూర్చొని తాగితే మరీ మంచిది.

దీపం పెట్టండి..

ఉదయం లేచి.. మలమూత్ర విసర్జన తర్వాత, ఇళ్లు శుభ్రం చేసుకుని స్నానం చేయండి. ఇంట్లో పూజగదిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అలాగే ఉదయాన్నే లేచి ఇలా ఫ్రెష్ అవ్వడం వల్ల రోజంతా యాక్టివ్​గా ఉంటారు. బద్ధకం ఉండదు. కాబట్టి మీరు దీపం పెట్టకున్నా.. రోజూ ఇలాంటి రొటీన్​ని సెట్ చేసుకోండి. దీంతో పాటు మీరు ఇంట్లోనే సాంబ్రాణి దూపం కూడా వెలిగించుకోవచ్చు. ఇది మంచి సువాసనలు అందించి మీ మూడ్​ని మెరుగుపరుస్తుంది. 

శంఖం లేదా గంట మోగిస్తే..

ఉదయం పూజ చేసిన తర్వాత.. శంఖం లేదా గంట మోగించడం వల్ల వాతావరణంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. ధ్వని తరంగాలు సూక్ష్మ బ్యాక్టీరియా, ప్రతికూల శక్తిని నాశనం చేస్తాయని చెప్తారు. శాస్త్రీయంగా కూడా ఇది నిరూపితమైనది. అందుకే శబ్ధానికి సంబంధించి పలు చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. లేదంటే మీరు యూట్యూబ్లో గాయత్రి మంత్రం కూడా పెట్టుకోవచ్చు. లేదా మీకు మానసిక మనశ్శాంతిని అందించే మ్యూజిక్ పెట్టుకోవచ్చు.

మొక్కలకు నీరు పోయండి..

పూజ సమయంలో తులసి మొక్కకి నీరు పోసి ప్రదక్షిణ చేయవచ్చు. లేదా మీరు పూజ చేయట్లేదు అనుకుంటే ఇంట్లో ఉన్న మొక్కలకు నీరు పోయడం, ఓ 5 నిమిషాలు గార్డెనింగ్ చేయడం వంటివి చేయాలి. ఇలా మొక్కలని తాకడం, వాటికి నీటిని పోయడం వల్ల మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

కాబట్టి ఉదయం లేచిన తర్వాత ఈ ఐదు అలవాట్లను ఫాలో అయిపోండి. దీనివల్ల మీ జీవితంలో ప్రతికూల శక్తి తొలగిపోవడమే కాకుండా మానసిక శాంతి కూడా లభిస్తుంది. దీంతో రోజంతా యాక్టివ్​గా ఉంటారు. 

Also Read : ప్రశాంతంగా ఉండాలంటే ఆ ఆలోచనలు వదిలేయండి.. మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం బ్రో

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
Why To Avoid Salads In Monsoon:వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
Embed widget