అన్వేషించండి

Overthinking : అతిగా ఆలోచించి సంతోషాన్ని కోల్పోతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే

Emotional well-being : ఓవర్ థింకింగ్​తో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మీరు కూడా అలా ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. 

Tips to Beat Overthinking : కొన్ని సందర్భాల్లో ఆలోచనలు దారుణంగా వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా జీవితంలో ఏదైనా అనుకోని విషయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు ఏమి లేని విషయం గురించి ఎక్కువ ఆలోచించి ఆందోళన పడిపోతూ ఉంటారు కొందరు. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే మీరు ఆలోచనల్ని కట్ చేసుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అయిపోండి. ఇవి మీకు అతిని తగ్గించి.. ఆలోచించే విధానంలో మార్పులు తీసుకువస్తాయి. 

తప్పో.. ఒప్పో..

ఆలోచించడాన్ని మీరు ఆపలేకపోతుంటే ఒక్క విషయాన్ని నోటిస్ చేయండి. మీరు అతిగా ఆలోచిస్తున్నప్పుడు అది మిమ్మల్ని బాధ పడేవైపునకు తీసుకువెళ్తుందా? లేదా మిమ్మల్ని సమస్య నుంచి బయటకు తెస్తుందా? ఈ రెండింటీలో తేడా గుర్తించినప్పుడు ఆలోచన ఈజీగా తగ్గుతుంది. సమస్యకు పరిష్కారం చూపించేది మంచిదే కానీ.. సమస్యను రెట్టింపు చేసే ఆలోచన అనవసరం అని గుర్తించండి. 

రాసుకోరా సాంబా..

మీకు తెలుసా? మీలోని సగం ఆలోచనలు రాయడం ద్వారా తగ్గుతాయట. మనసులోని భారం పేపర్​ మీద పెట్టినప్పుడు రిలాక్స్ అవుతారు. మానసికంగా స్ట్రెస్ తగ్గుతుంది. రాయకుండా లోపలే ఉంచుకుంటే అది డ్రైన్ అవ్వకుండా ఆలోచల్ని రేకెత్తిస్తూ ఉంటుంది. లేదంటే మీరు ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్స్​తో కూడా మీ ఆలోచనలు పంచుకోవచ్చు. అయితే మీ ప్రశ్నలు రెట్టింపు చేసేవారితో కాకుండా ఏదొక బదులు ఇవ్వగలిగేవారితో పంచుకుంటే మంచిది.

టైమ్ లిమిట్

సమస్య వచ్చినప్పుడు ఆలోచించకుండా ఉంటే తప్పే. కానీ ఆలోచనలకి కూడా ఓ టైమ్ లిమిట్ పెట్టుకోండి. 5 నుంచి 10 నిమిషాలు దానిగురించి ఆలోచించండి. గుడ్, బ్యాడ్ అన్ని తెలుసుకోండి. తర్వాత మీరు దానిని వదిలేయండి. లేదా ఆ పనిని గుర్తురానివ్వని పనిపై ఫోకస్ చేయండి. వ్యాయామం, గేమ్స్ ఆడడం వంటివి చేయొచ్చు. 

కంట్రోల్ 

ఏమి చేసినా ఆలోచనలు తగ్గట్లేదు అంటారు కొందరు. కానీ మీకు తెలుసా మీరు అనుకుంటే కచ్చితంగా వాటిని కంట్రోల్ చేయగలరు. ఒక ప్రాబ్లమ్​లో మీరు కంట్రోల్ చేయగలిగే విషయాలను నోట్ చేయండి. మీరు ఏమి చేసినా కంట్రోల్​ అవ్వని వాటి గురించి ఆలోచించి వేస్ట్. మెంటల్లీ క్లారిటీగా ఉన్నప్పుడు ఆలోచన అతిగా వెళ్లదు. 

మెడిటేషన్ 

ఎన్ని చేసినా ఆలోచనలు ఆగట్లేదు అనుకున్నప్పుడు మెడిటేషన్ చేయండి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఈ సమయంలో మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. ప్రశాంతంగా ఉంటారు. 

అలా.. ఎలా?

అలా చేస్తే.. అలా అయితే.. ఇలా జరిగితే.. అనే పదాలు భయాన్ని రెట్టింపు చేస్తాయి. కాబట్టి వాటిని కట్ చేసేయండి. జరిగేది జరగక మానదు. దానికి మీరు ఎంత వరకు ఎఫర్ట్స్ పెట్టగలరో గుర్తించండి. 

అంత మంచికే..

మంచి జరిగినా.. చెడు జరిగినా దానిని స్వీకరించడం నేర్చుకోగలిగితే ఎలాంటి ఆలోచనలు మనల్ని డిస్టర్బ్ చేయలేవు. కాబట్టి ఏ పరిస్థితిని అయినా ముందుగా యాక్సెప్ట్ చేసి తర్వాత పరిణామాలు యూనివర్స్​కి వదిలేయండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget