Tips to Calm Yourself : లైఫ్ మరీ టఫ్‌గా మారి, ప్రెజర్ ఎక్కువ అవుతుందా? బ్రేక్ తీసుకో బ్రో.. ఇవి ఫాలో అయిపో
Mental Peace : ఒత్తిడి అనేది ఎప్పుడూ.. ఏ రూపంలో వస్తుందో తెలియదు. దీనివల్ల లైఫ్ టఫ్‌గా మారిపోతుంది. ఇప్పుడు మీరు అదే పరిస్థితుల్లో ఉంటే ఇది మీకోసమే..

Tough Times Motivation : ఉదయం నిద్రలేచాక ఇంకో రోజు స్టార్ట్ అయ్యిందని రిఫ్రెష్‌గా ఫీల్ అయ్యేవారికంటే.. అబ్బా అప్పుడే తెల్లారిందా.. మళ్లీ ఈ తిప్పలు తప్పవా అనుకునేవారు ఎక్కువ. జాబ్, ఫ్యామిలీ, కెరీర్ ఇలా ఎన్నో టెన్షన్లతో లైఫ్ నిండిపోయి.. ఎటైనా పారిపోతే బాగుండు అనే ఆలోచనల్లో రోజులు గడిపేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఒత్తిడి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల లైఫ్ మరింత టఫ్‌గా మారుతుంది. మీరు కూడా ప్రస్తుతం ఈ పరిస్థితుల్లోనే ఉంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.
మైండ్ డిస్టర్బ్‌గా ఉంటే..
మీ మైండ్‌ని క్లియర్ చేసుకోవడంలో వాకింగ్ మంచి ఫలితాలు ఇస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. కాబట్టి మైండ్ డిస్టర్బ్‌గా ఉన్నప్పుడు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి నడవండి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ప్రశాంతతను అందించి.. మైండ్‌ని రిఫ్రెష్ చేస్తుంది.
ఆఫ్ తీసుకోండి..
జాబ్ టెన్షన్, టార్గెట్స్ మిమ్మల్ని గాలి కూడా పీల్చుకోనివ్వట్లేదా? బ్రో ఏది అయితే అది అయింది. ఓ రోజు లీవ్ తీసుకో. ఆ రోజు నీకు నచ్చిన పని చేయి. ఏమి చేయకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తే.. ఏమి చేయకుండానే నీ రోజును గడుపు. ప్రశాతంగా ఉంటుంది. ఫోన్, మెయిల్స్‌కి దూరంగా ఉంటే ఇంకా బెటర్.
సహాయం చేయండి..
తెలిసినవాళ్లకి సాయం చేసే బదులు తెలియని వాళ్లకి మీకు చేతనైన సాయం చేయండి. దీనివల్ల మీకు మానసికంగా సంతోషం వస్తుంది. సాయం అంటే డబ్బు రూపంలోనే ఇచ్చేది కాదు.. ఓ వ్యక్తికి పనిలో హెల్ప్ చేయడం, ఫుడ్ ఆఫర్ చేయడం, ట్రావెల్ చేస్తున్నప్పుడు సీట్ ఇవ్వడం వంటివి. ఇలా ఏది చేసినా మీకు పాజిటివ్‌గా ఉంటుంది.
జనాల మధ్యకి వెళ్లండి..
ప్రశాంతంగా కూర్చొనేప్పుడు కంటే.. మీరు ఓ చాయ్ షాప్ దగ్గరికి వెళ్లి కూర్చొండి. అక్కడి ఎంతమంది ఎన్నిరకాలుగా ఉన్నారో ఓ లుక్ వేయండి. ఎవరి టెన్షన్లో వాళ్లు తిరుగుతున్నట్లు.. లేదా చిల్ అవుతున్నట్లు కనిపిస్తారు కదా. మీకు సంబంధం లేని వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు మీరు చాలా విషయాలు నోటిస్ చేస్తారు. ఇవి మీకు ఒత్తిడిని దూరం చేసుకోవడంలో హెల్ప్ అవుతాయి.
కొత్త విషయాలు..
మీకు ఏదైనా పనిపై లేదా ప్రాజెక్ట్‌పై ఆసక్తి ఉంటే దానిగురించి తెలుసుకునేందుకు ప్రయత్నించండి. కొత్తవాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పుడు బ్రెయిన్లో ఉన్న టెన్షన్ బ్రేక్ తీసుకుంటుంది.
టూ డూ లిస్ట్
మీరు చేయాల్సిన పనులు.. కచ్చితంగా చేయాల్సిన పనులను ముందు రోజు పడుకునేముందు రాసుకోండి. దీనివల్ల మైండ్ రేపటి గురించి ఆలోచించడం మానేసి.. రిలాక్స్ అవుతుంది. ఇలా చేయడంవల్ల నిద్ర కూడా మెరుగవుతుంది.
బలాలు గుర్తించండి..
మీరు బాగా ఫీల్ అయినప్పుడు నాకు ఏమి చేతకాదని.. నేను చేయలేను అనుకోవచ్చు. లేదా మిమ్మల్ని ఇతరులు చేతకానివారిగా ప్రొజెక్ట్ చేస్తుండవచ్చు. అలాంటి పరిస్థుతుల్లో ఉన్నప్పుడు మీరు దేనిలో బలవంతులో, సమర్థులో నోట్ చేసుకోండి. వాటిని చదివినప్పుడు మీకు తెలియని ధైర్యం వస్తుంది. అలాగే మీరు కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో కూడా ఈజీగా తెలుసుకోగలరు.
ఆగిపోవద్దు.. ముందుకెళ్లండి..
ఓ పరిస్థితి మన చేజారిపోయినప్పుడు ఆగిపోవడం కంటే.. దానిని ఓవర్ కామ్ చేసి ముందుకు వెళ్లడం మంచిది. మీరు ఒకవేళ 0కి పడిపోయినా.. మళ్లీ లైఫ్‌ని రీస్టార్ట్ చేయవచ్చు. ఓ పనిలో సక్సెస్ కాలేదంటే మీరు పనికిరారని అర్థంకాదు. ఆ పనిని మీరు వేరే రకంగా పూర్తి చేయవచ్చు. లేదా వేరే పనుల్లో మీరు తోపులు కూడా అవ్వొచ్చు. కాబట్టి ఎక్కడా ఆగిపోకండి.
మెచ్చే హాబీలు
మీకు నచ్చిన, మెచ్చిన హాబీలు ఉంటాయి కదా. వాటిని వదలకండి. ఒకవేళ గతంలో వాటిని వదిలేస్తే మళ్లీ రీస్టార్ట్ చేయండి. ఇవి మీకు మంచి రిలీఫ్ ఇస్తాయి.
ఏది ముఖ్యమో తెలుసుకో..
మీకు ఇప్పుడు ఏది అవసరమో.. ఏది కచ్చితంగా చేయాలో.. ఏది ఇంపార్టెంట్ అనే విషయాలపై క్లారిటీ ఉండాలి. మీరు చేయాల్సిన పనులే మీ మొదటి బాధ్యత అని గుర్తించుకోండి. మీ పనిని డిస్టర్బ్ చేసే లేదా మీపై ఒత్తిడిని పెంచే రిక్వెస్ట్‌లకు నో చెప్పండి.
చిల్ అవ్వు బ్రో..
లైఫ్‌లో నీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు. అంత మాత్రానా నువ్వు లైఫ్‌ని సీరియస్‌గా తీసేసుకుంటే ఎలా. అప్పుడప్పుడు నీలోని చైల్డ్ని కూడా గుర్తించు. కాస్త చిలిపి పనులు చేస్తూ ఉండు. అల్లరిగా ఉండు. ఇంట్లో వారిని ఆటపట్టించు. ఫ్రెండ్స్‌తో ప్రాంక్స్ చేయ్. లైఫ్‌ని సీరియస్‌గా తీసుకుంటే కష్టం.
ఏడుపొస్తుందా?
భరించలేని బాధతో ఇబ్బంది పడుతున్నావా? అయితే ఏడుపుని దాచుకోకు. ఏడ్చేయి. కచ్చితంగా రిలీఫ్ ఉంటుంది. ఏడ్వడం అనేది ఓ ఎమోషన్ అని గుర్తించు. అదేమి నామోషీ కాదు అర్థమైందా?
మంచిగా టైమ్‌కి నిద్రపో. టైమ్‌కి నిద్ర లేగు. నీతో నువ్వు మాట్లాడుకో. నెగిటివ్‌గా మాట్లాడేవారికి దూరంగా ఉండు. కుదిరితే జర్నల్ మెయింటైన్ చేయి. లైఫ్ అనేది ఓ జర్నీ అనేది గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నా.. నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే సంతోషాలు కూడా వస్తాయి. ఇంకా ఎక్కువ కష్టాలు వస్తున్నాయి అంటావా.. అయితే నీకు భరించే ఓపిక ఎక్కువ అనుకుని ధైర్యంగా ముందుకు వెళ్లు. వీటివల్ల మీ సమస్యలు తీరకపోవచ్చు కానీ.. వాటిని ఎదుర్కొనే ఓపిక మీ మైండ్‌కి, శరీరానికి అందుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. లైఫ్‌ని ఎంజాయ్ చేయకపోయినా.. కాంప్లికేట్ చేసుకోకండి.






















