మార్నింగ్ రోటీన్ అనేది.. మన కంప్లీట్ డే మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మెడిటేషన్ లేదా యోగాతో మీ రోజును ప్రారంభించండి. మంచి స్కిన్ కేర్ తీసుకోండి. ఇది మీరు రోజంతా ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈ రోజు కచ్చితంగా చేయాలనుకుంటున్న పనులేంటో నోట్ చేసుకోండి. మీకు టీ లేదా కాఫీ అలవాటు ఉంటే.. ప్రశాంతంగా బాల్కనీలో కూర్చోని తాగేయండి. మీకు నచ్చిన సాంగ్స్ వినండి. వాటికి అనువుగా చిన్న చిన్న స్టెప్స్ వేయండి. ఇవన్నీ మీరు పాజిటివ్‌గా ఉండేలా మీకు సహాయం చేస్తాయి.