చాలా రకాల వంటల్లో రిఫైన్డ్ ఆయిల్ వాడుతుంటారు.

దీన్ని వాడితే ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకున్నట్టే అని నిపుణులు చెబుతున్నారు.

రిఫైన్డ్ ఆయిల్ ఎక్కువగా వాడే వారిలో గుండెజబ్బులు, స్థూలకాయం, ఇన్ఫ్లమేషన్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

రిఫైన్డ్ నూనెల ద్వారా ఎక్కువ క్యాలరీలు శరీరంలో చేరుతాయి. ఇది బరువు పేరిగేందుకు కారణం అవుతుంది.

ఇన్సులిన్ సెన్సిటివిటీ మీద నేరుగా ప్రభావం చూపుతుంది, షుగర్ స్థాయిలు అదుపులో పెట్టుకోవడానికి దీనికి దూరంగా ఉండడమే మంచిది.

రిఫైన్డ్ ఆయిల్ తో చర్మ సమస్యలు వస్తాయట. అది మానేశాక చర్మం క్లియర్ మారిందని కొంతమంది చెప్పారు.

ప్రాసెస్ చేసిన నూనెలు మానేసిన తర్వాత జీర్ణక్రియ మెరుగవడం గమనించవచ్చు.

నెల రోజుల పాటు రిఫైన్డ్ ఆయిల్ మానేస్తే కలిగే ప్రయోజనాలు ఎవరికి వారు అనుభూతి చెందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

చాలా రకాల శరీర ధర్మాల నిర్వహణకు కొవ్వులు అవసరం అని మరచిపోవద్దు.

పూర్తిగా నూనె మానెయ్యడం కాకుండా ఆరోగ్యకరమైన నూనెలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Representational Image : Pexels