డయాబెటిస్ తో బాధపడుతున్నారా? పరగడుపున వీటిని తీసుకోండి! గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే డయాబెటిస్ బాధితులకు ఉపశమనం కలుగుతుంది. టీలో దాల్చిన చెక్క వేసుకుని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. కాకరకాయ రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే అవకాశం ఉంటుంది. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగితే రక్తంలో చక్కెరను తగ్గించవచ్చు. ఉసిరికాయ రసాన్ని తాగితే రోగ నిరోధకశక్తిని పెంచడంతో పాటు రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయవచ్చు. ఖాళీ కడుపుతో కలబంద రసం తాగడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు. తులసి ఆకులు టీలో వేసుకుని తాగవం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయవచ్చు. గ్రీన్ స్మూతీస్ హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి. All Photos Credit: pixabay.com