ఇండియన్ క్యుసిన్ గా ప్రఖ్యాతి గాంచిన అనేక వంటకాల్లో వాడే కూరగాయలు ఇక్కడి కానేకావట.

ఆలుగడ్డ, బంగాళా దుంపలు నిజానికి బెంగాలీవి కావు ఇవి దక్షిణ అమెరికాలోని ఆండీస్ ప్రాంతానికి చెందినవి.

టమాట లేకుండా వంట ఊహించలేని స్థితిలో ఇపుడు మనం ఉన్నాం కానీ టమాటలు కూడా దక్షిణ అమెరికావే.

బజ్ఝీల నుంచి పచ్చళ్ల వరకు అన్నింట్లో వాడే మిర్చి పోర్చుగీసు వాళ్లు మన దేశానికి తెచ్చారు.

తెలివి పెంచే కూరగాయలుగా ప్రసిద్ధి చెందిన బెండకాయలు ఆఫ్రికాకు చెందినవి.

గోబీ మంచూరియా, గోబీ పారాఠా అని చేసుకునే కాలీఫ్లవర్లు మధ్యధరా ప్రాంతానికి చెందినవి.

క్యాబేజి కూడా యూరప్, ఆసియా దేశాల నుంచి ఇండియాకు వచ్చిందే.

క్యారట్ హల్వా, మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీలో వాడుకునే క్యారెట్ మధ్య ఆసియాలో సాగు చేసేవారు.

ఇది ఇండియాకు కొత్త కూరగాయే కానీ ఈ మధ్య విరివిగా వాడుతున్నారు



మొక్కజొన్నలు కూడా పోర్చుగీసు వారే భారత్ కు తెచ్చారు.



సలాడ్లు, పన్నీర్ వంటి కూరల్లో ఎక్కువగా ఉపయోగించే క్యాప్సికమ పోర్చ గల్ నుంచే ఇండియాకు వచ్చింది.

Representational Image : Pexels