కాఫీ తాగితే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది



కాఫీ అంటే ఎంతో మందికి ఇష్టం. ప్రతి రోజూ కాఫీ తాగనిదే తెల్లారని వారెందరో.



కాఫీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.



ఇప్పుడు మరో అధ్యయనం కాఫీకి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గించే సామర్థ్యం కూడా ఉందని చెబుతోంది.



అయితే కాఫీకి చక్కెర వంటికి జోడించకుండా తాగితేనే ఆరోగ్యం. కానీ ఎంతో మంది చక్కెరను కలుపుకునే తాగుతారు.



చక్కెర కలుపుకోకుండా రోజుకు రెండు సార్లు కాఫీ తాగితే క్యాన్సర్ వచ్చే రిస్క్ 12 శాతం తగ్గుతుంది.



అలాగే గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి రోగాలు కూడా రాకుండా ఉంటాయి.



బరువును పెరగకుండా అడ్డుకునే శక్తి కూడా కాఫీకి ఉంది. కానీ చక్కెర జోడించకుండా తాగితేనే ఈ ఫలితం వస్తుంది.



కాబట్టి ప్రతిరోజు కాఫీని తీపి లేకుండా తాగేందుకు ప్రయత్నించండి.