చాలా మందికి వంట చెయ్యడం ఇష్టమున్నప్పటికీ ఎక్కువ సమయం కిచెన్ లో గడపడం విసుగ్గా ఉంటుంది.

కొన్ని చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే వంట త్వరగా పూర్తి చేసుకోవచ్చు.

కూరగాయలను కోసుకోవడం నుంచి వాటిని తాజాగా ఉంచేందుకు ఉపయోగపడే వంటింటి చిట్కాలు చూద్దాం.

ఉల్లిపాయ ముక్కలను వేయించే సమయంలో చిటికెడు ఉప్పు లేదా చక్కెర చేరిస్తే త్వరగా బంగారు రంగులో వేగుతాయి.

బీన్స్ స్టోర్ చేసే సమయంలో రెండు అన్నింటిని జోడించి రెండు చివరల్లో రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే తక్కువ సమయంలో కట్ చేసుకోవచ్చు.

ఛోలే ఉడికించే సమయంలో కొన్ని టీ ఆకులను మూటకట్టి వేస్తే రెస్టారెంట్ స్లయిల్ ఛోలే తయారు చేసుకోవచ్చు.

డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కాలం పాటు తాజాగా ఉండేందుకు జిప్ లాక్ కవర్లలో ఉంచి ఫ్రిజ్ లో పెడితే సరి.

పాలు కాచే సమయంలో గిన్నే మీద చెక్క చెంచా ఉంచితే పాలు పొంగవు.
.

Representational Image : Pixels and Pixabay