చాలా మందికి ఊరికే వేడి చేస్తుంటుంది. వాళ్లవి హీట్ బాడీస్ అని అంటుంటారు కూడా

ఇలా త్వరగా వేడి చేసే శరీరతత్వం ఉన్న వాళ్లు కొన్ని విషయాలు గమనించుకోవాలి.

తీసుకునే ఆహారంలో ఎక్కువ మసాలాలు, నూనెలు ఉంటే అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఇలా ఆహారం ఎక్కువ సమయం పాటు జీర్ణం కాకపోతే కడుపులో గ్యాస్ చేరుతుంది.



మాంసాహారం ఎక్కువగా తీసుకునే వారికి కూడా తరచుగా వేడి చేస్తుంది.



తగినన్ని నీళ్లు తాగకపోయినా సరే ఒంట్లో వేడి చేస్తుంది.

వీటికి అతీతంగా కొందరి శరీర తత్వం వేడిగా ఉంటుంది.

వేడి చేసినపుడు మూత్రంలో మంట, కళ్లలో మంట, వేడి పొక్కులు రావడం వంటి సమస్యలు రావచ్చు.

వేడి తగ్గాలంటే ముందుగా జీర్ణ సమస్యలను పరిష్కరించుకోవాలి.

చన్నీటి స్నానం చెయ్యడం, తరచుగా కోల్డ్ ఫూట్ బాత్ వంటి చిన్న చిన్న జాగ్రత్తలతో వేడి అదుపు చెయ్యవచ్చు.

Representational Image : Pixels and Pixabay