ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన ఖనిజలవణాల్లో రాగి కూడా ఒకటి.

కాపర్ రోగ నిరోధక శక్తికి కూడా అవసరం. నాడీ కణాల ఆరోగ్యానికి కాపర్ ముఖ్యమైన పోషకం.

కొల్లాజెన్, ఎముకల వృద్దికి కూడా కాపర్ అవసరం.

కాపర్ అందాలంటే రాగి పాత్రలో నీళ్లు తాగాలని సలహా ఇస్తారు.

మరి నిరంతరం రాగి పాత్రలో నీళ్లు తాగడం అవసరమా? అసలు నిపుణుల సలహా ఇస్తున్నారు.

రాగి పాత్రలో నీళ్లు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్ని పరిమితులు కూడా సూచించింది.

అప్పుడప్పుడు రాగి పాత్రలో నీళ్లు తాగడం మంచిదే. కానీ ప్రతి సారీ కాదు.

రోజూ ఇలా రాగి పాత్రలో నీళ్ల తాగితే కాపర్ పాయిజనింగ్ కావచ్చు.

రాగి పాత్రలో పదేపదే నీళ్లు నింపడం వల్ల దానిలో తుప్పు చేరే ప్రమాదం ఉంటుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు.

రోజూ రాగి పాత్ర నుంచి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ, లివర్ కి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.

కాపర్ పాయిజనింగ్ వల్ల తలనొప్పి, తలతిరగడం, గొంతు ముక్కులో ఇరిటేషన్ కూడా రావచ్చు.



Representational Image : Pixels and Pixabay