నడక మంచి వ్యాయామ పద్ధతి, శారీరక మానసిక ఆరోగ్యానికి నడక చాలా మంచి సాధన.

కొన్ని జాగ్రత్తలతో నడిస్తే మరింత లాభదాయకం అని నిపుణులు చెబుతున్నారు.

నడకకి వాడే షూస్ సౌకర్యంగా ఉండేట్టు చూసుకోవాలి. లేక పోతే కాసేపు నడవగానే పాదాల్లో నొప్పులు, బొబ్బలు రావచ్చు.

నడుస్తున్నపుడు చేతులు లయబద్ధంగా కదిలిండం కూడా ముఖ్యమే.

కోఆర్డినేటెడ్ ఆర్మ్ స్వింగ్ కూడా నడక సామర్థ్యాన్ని పెంచుతాయి.

నడక వంటి వ్యాయామం చేసేప్పుడు హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం.

డీ హైడ్రేషన్ వల్ల కండరాలు అలసిపోయి తిమ్మిరి రావచ్చు. కనుక వాకింగ్ వెళ్లే సమయంలో వాటర్ బాటిల్ తీసుకు వెళ్లాలి.



నడిచే సమయంలొ ఒంట్లో వేడి పుడుతుంది. కనుక సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం కూడా చాలా ముఖ్యం.



Representational Image : Pexels