బ్రౌన్ షుగర్ ఎందుకు ఆరోగ్యానికి మంచిదో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం

చక్కెరను తెల్లగా చేసేందుకు చాలా ప్రాసెస్ అవసరమవుతుంది. అందువల్ల సహజమైన మొలాసిస్ తొలగిపోతుంది.

బ్రౌన్ షుగర్ ఒక ప్రత్యేకమైన రుచితో పాటు రంగును కూడా కలిగి ఉంటుంది. అందుకు ఇందులో మిగిలిపోయిన మొలాసిస్ కారణం.

అంతేకాదు బ్రౌన్ షుగర్ లో కాల్షియం, పొటాషియం, ఐరన్ తెల్లని చక్కెర తో పోలిస్తే కొంచెం ఎక్కువ.

బ్రౌన్ షుగర్ లోని మొలాసిస్ చక్కటి అరోమాను ఇస్తుంది. మిఠాయిలకు ప్రత్యేక రుచిని ఇస్తుంది.

బ్రౌన్ షుగర్ జీఐ కూడా తక్కువ. కనుక రక్తంలో చక్కెర స్థాయిలను తెల్లని చక్కెరతో పోలిస్తే తక్కువ మొత్తంలో పెంచుతుంది.

బ్రౌన్ షుగర్ లో తేమ ఎక్కువ కనుక బేకింగ్ కి ఒక ప్రత్యేక రుచిని ఇస్తుంది.

బ్రౌన్ షుగర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఎక్కువ.
Representational Image : Pexels and Pixabay