చాలా మంది పరగడుపున నిమ్మకాయ నీటిని తేనెతో తీసుకుంటారు. అయితే ఇది జీర్ణాశయం లైనింగ్‌కు ఇరిటేషన్ కలిగించవచ్చు.

నిమ్మరసంలో ఉండే ఆమ్లగుణం వల్ల అల్సర్లు కూడా రావచ్చు.

నిమ్మకాయ నీళ్లు శరీరాన్ని డీటాక్సికేట్ చేస్తాయి.

మూత్ర పిండాలు ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేసేందుకు కారణం అవుతాయి.

అయితే నీటితో పాటు తరచుగా ఎలక్ట్రోలైట్లను బయటకు పంపుతుంది. అందువల్ల డీహైడ్రేషన్ కు కారణం కావచ్చు.

రోజు నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ కు కారణం కావచ్చు.

నిమ్మ రసంలోని ఆమ్లగుణం వల్ల దంతాల్లో ఎనామిల్‌కు నష్టం జరిగి సెన్సిటివిటి పెరుగుతుంది.

దంతాల సెన్సిటివిటితో బాధపడే వారు నిమ్మకాయ వంటి ఆమ్ల గుణం కలిగిన పదార్థాలు తీసుకోవద్దు

నిమ్మకాయ రసం ఎక్కువగా ఉపయోగిస్తే జుట్టు కుదుళ్లను పొడిబారేలా చేసి జుట్టుకు నష్టం కలిగిస్తుంది.



నిమ్మకాయల్లో ఉండే ఆమ్లతత్వం నోటిలో పుండ్లు పడే ప్రమాదం ఉంటుంది.



నోటి క్యాన్సర్‌తో బాధపడేవారు నిమ్మరసం అస్సలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



Representational Image : Pexels