Cabbage: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్యాబేజీని కొంచెం కూడా తినకూడదు
క్యాబేజీ సాధారణంగా బలాన్నిచ్చే కూరగాయే. కానీ కొందరికి మాత్రం సమస్యలు తెచ్చిపెడుతుంది.
క్యాబేజీ కూరగాయ లేక ఆకుకూరా? ఈ డౌట్ చాలా మందికి ఉంది. అది ఏదైనా కూడా తింటే ఆరోగ్యమే. ఎందుకంటే ఇందులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, ఎ, సి, కె వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకి చాలా అవసరమైనవి. అంతేకాదు క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేసే ఫైటో న్యూట్రియెంట్లు ఉంటాయి. అవి ప్రాణాంతక రోగాలు శరీరంపై దాడి చేయకుండా కాపాడతాయి. క్యాన్సర్ వంటి రోగాలను అడ్డుకోవడంలో ఈ ఫైటో న్యూట్రియెంట్లు సమర్థంగా పనిచేస్తాయి. క్యాబేజీ వల్ల అన్ని లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అయితే సంపూర్ణ ఆరోగ్యవంతుడికి క్యాబేజీ వల్ల కలిగే సమస్యలు లేవు కానీ, ఇప్పటికే కొన్ని అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి మాత్రం క్యాబేజీ తినడం వల్ల సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
ఎవరు క్యాబేజీ తినకూడదంటే...
1. క్యాన్సర్ ను అడ్డుకోవడంలో క్యాబేజీలోని పోషకాలు సహకరిస్తాయి. కానీ క్యాన్సర్ బారిన పడిన వారికి మాత్రం క్యాబేజీ వల్ల ఉపయోగం లేదు. వారు దీన్ని తినకూడదు. తింటే విరేచనాలు అధికంగా అయ్యే అవకాశం ఉంది.
2. అజీర్ణం, కడుపుబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు కూడా క్యాబేజీని దూరం పెట్టాలి. ఎందుకంటే ఇందులో రిఫినోస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది గ్యాస్ ను పెంచుతుంది. దీని వల్ల ఆహారం జీర్ణం కాదు. దీనివల్ల కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది.
3. థైరాయిడ్ సమస్య ఉన్నవారు అందులోనూ ముఖ్యంగా హైపోథైరాయిడిజంతో బాధపడేవారు కూడా క్యాబేజీని దూరం పెట్టాలి. థైరాయిడ్ గ్రంథి పనితీరుపై క్యాబేజీ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వీరు పూర్తిగా క్యాబేజీని తినడం మానేయాలి.
4. విరేచనాలు అవుతున్నప్పుడు కూడా క్యాబేజీని తినకూడదు. తింటే విరేచనాలు కావడం పెరిగిపోతుంది.
5. కొందరిలో రక్తం గడ్డలు కడుతుంది. వారు రక్తం పలుచన చేసేందుకు మందులను వాడుతున్నప్పుడు క్యాబేజీని తినకూడదు. ఎందుకంటే దీనిలో విటమిన కె ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని అధికం చేస్తుంది.
ఈ ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నవారంతా కూడా క్యాబేజీని తినకూడదు. వైద్యుడి సలహా మేరకు నిర్ణయం తీసుకోండి.
Also Read: నీతా అంబానీ చేతిలో నీళ్ల బాటిల్... ఆ నీళ్ల బాటిల్ ఖరీదుతో హైదరాబాదులో ఫ్లాట్ కొనేయచ్చు
Also Read: క్రూరమైన కిల్లర్... కార్డియాక్ అరెస్టు, వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపించొచ్చు, జాగ్రత్త పడండి
Also Read: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్
Also Read: ఇంజెక్షన్ అంటే భయమా? మీలాంటివాళ్ల కోసమే సూది లేని ఇంజెక్షన్లు వస్తున్నాయి...
Also Read: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
Also Read: చీరకట్టుకూ రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి మధ్య బంధమేంటి?