అన్వేషించండి

Obesity Cervical Cancer: మహిళల్లో ఊబకాయం.. ఆ భయానక ముప్పు తప్పదంటున్న వైద్యులు - వామ్మో, జాగ్రత్త

Obesity Cervical Cancer: మారుతున్న జీవనశైలి కారణంగా అనేక మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. గర్భాశయ క్యాన్సర్ కు కూడా ఊబకాయంతో ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Obesity Cervical Cancer: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎంతో మంది అనారోగ్యం బారినపడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఊబకాయం అనేక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారకంగా మారింది. గర్భాశయ క్యాన్సర్ కు కూడా ఊబకాయంతో ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెరుగైన అవగాహన, నివారణ ఊబకాయం, గర్భాశయ క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడం ముఖ్యమని డా. కృష్ణారెడ్డి, కన్సల్టెంట్ - మెడికల్ ఆంకాలజీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ తెలిపారు.  ఊబకాయానికి , గర్భశయ క్యాన్సర్ కు మధ్య సంబంధమేంటో తెలుసుకుందాం. 

ఇమ్యునిటీ సిస్టమ్‌ను దెబ్బతీస్తుంది:

అధిక శరీర కొవ్వు రోగనిరోధక ప్రతిస్పందనను దెబ్బతీస్తుంది. ఇది క్యాన్సర్ కణాలను గుర్తించడంలో, నాశనం చేయడంలో దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. క్యాన్సర్‌గా మారే వాటితో సహా అసాధారణ కణాలను గుర్తించడంలో, వాటిని తొలగించడంలో రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఊబకాయం ఉన్న వ్యక్తులలో, రోగనిరోధక ప్రతిస్పందన గర్భాశయంలోని క్యాన్సర్ కణాలను గుర్తించడంలో, దాడి చేయడంలో విఫలం అవుతుంది. , తద్వారా మరింత పెరిగే అవకాశం ఉంది.

హార్మోన్ అసమతుల్యత:

హార్మోన్ అసమతుల్యత కారణంగా స్త్రీలల్లో ఊబకాయం లేదా అధిక బరువుకు గురవుతారు.  ఈ హార్మోనల్ హెచ్చుతగ్గులు అనేది గర్భాశయ క్యాన్సర్‌ కారకాల్లో ప్రధానమైనదిగా చెప్పవచ్చు. శరీరంలోని కొవ్వు కణాలు ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది పునరుత్పత్తి వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. మహిళల్లో, ఈస్ట్రోజెన్ ఋతు చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది . అంతేకాదు  జననాంగాల ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నప్పుడు, శరీరం అవసరమైన దానికంటే ఎక్కువ ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అదనపు ఈస్ట్రోజెన్ గర్భాశయం లైనింగ్ చాలా మందంగా పెరగడానికి కారణమవుతుంది.  దీనిని ‘ఎండోమెట్రియల్ హైపర్‌ప్లాసియా’ అని పిలుస్తారు. దీనిని గుర్తించడానికి తరుచూ హెల్త్ చెకప్ లు చేయించుకోవడం మంచిది. అలా కాకుండా దీనిని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్‌గా మారుతుంది. అదనంగా, ఊబకాయం తరచుగా ప్రొజెస్టెరాన్ తక్కువ స్థాయిలకు దారితీస్తుంది. ఈస్ట్రోజెన్ ప్రభావాలను సమతుల్యం చేసే హార్మోన్, ప్రమాదాన్ని మరింత పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. 

ఇన్సులిన్ రెసిస్టెన్స్:

మరొక ముఖ్యమైన అంశం ఇన్సులిన్ నిరోధకత. ఇది ఊబకాయం ఉన్న వ్యక్తులలో ఒక సాధారణ పరిస్థితి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడే హార్మోన్ అయిన ఇన్సులిన్‌కు శరీర కణాలు తక్కువగా స్పందించినప్పుడు ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇది ఇన్సులిన్-వంటి వృద్ధి కారకాల (IGFs) స్థాయిలతో పాటు రక్తప్రవాహంలో ఇన్సులిన్ అధిక స్థాయికి దారితీస్తుంది. ఇన్సులిన్, IGFలు రెండూ కణాల విస్తరణను ప్రోత్సహిస్తాయి. అంతేగాకుండా అపోప్టోసిస్ (ప్రోగ్రామ్డ్ సెల్ డెత్) నిరోధిస్తాయి. క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందడానికి, పెరగడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి. గర్భాశయంలోని ఎండోమెట్రియల్ కణాలు ఈ ప్రభావాలకు ప్రత్యేకించి సున్నితంగా ఉంటాయి. గర్భాశయ క్యాన్సర్ అభివృద్ధిలో ఇన్సులిన్ నిరోధకత కీలక పాత్ర పోషిస్తుంది.

ఇలా నివారించవచ్చు:

గర్భాశయ క్యాన్సర్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవడం ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. సమతుల్య ఆహారం తీసుకోవడం, చురుకుగా ఉండటం, బరువును నిర్వహించడం గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కీలకమైన మార్గాలు. ఊబకాయం  ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించే ప్రజారోగ్య కార్యక్రమాలు గర్భాశయ క్యాన్సర్ కేసుల సంఖ్యను బాగా తగ్గించగలవని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: మాయదారి తుమ్ము.. దెబ్బకు పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేశాయి, ఇంతకీ అతడు బతికే ఉన్నాడా?

టాప్ హెడ్ లైన్స్

Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Castor Oil for Hair : జుట్టు ఒత్తుగా, మెరుస్తూ ఉండాలా? మీ జుట్టు రకాన్ని బట్టి ఆముదాన్ని ఇలా అప్లై చేయండి
జుట్టు ఒత్తుగా, మెరుస్తూ ఉండాలా? మీ జుట్టు రకాన్ని బట్టి ఆముదాన్ని ఇలా అప్లై చేయండి
Healthy Gut : కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
Saffron Water : ఉదయాన్నే కుంకుమ పువ్వు నీళ్లు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఎలా తాగాలో తెలుసా?
ఉదయాన్నే కుంకుమ పువ్వు నీళ్లు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఎలా తాగాలో తెలుసా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget