అన్వేషించండి

మాయదారి తుమ్ము.. దెబ్బకు పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేశాయి, ఇంతకీ అతడు బతికే ఉన్నాడా?

తుమ్ము సౌండ్‌కు పక్కను ఉన్న వ్యక్తులు భయ పడటమే చూసుంటారు. అమెరికాలో అయితే గట్టిగా తుమ్మిన పాపానికి పొట్టలోని పేగులు కడుపు చీల్చుకుని మరీ బయట పడ్డాయి.

కొందరు తుమ్మితే వీధి చివరకు వినిపిస్తుంది. వాళ్ల తుమ్ము రీసౌండ్ అంత గట్టిగా ఉంటుంది మరి. వాళ్ల పక్కన పిల్లలుంటే.. జడుచుకుని గుక్కపెట్టి ఏడ్చేస్తారు కూడా. అదీ తుమ్ము పవర్‌ అంటే. కొన్ని సార్లు తుమ్మితే.. ముక్కు ఊడిపోతుందేమో అన్న భయం కూడా వేస్తుంది. ముక్కు సంగతి ఏమోగానీ.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ వ్యక్తికి ఏకంగా కడుపులో పేగులే భయటకు వచ్చేశాయట.

అసలు కథ ఏమిటంటే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన 63 ఏళ్ల వ్యక్తి భ్యారతో కలిసి రెస్టారెంట్‌లో బ్రేక్‌ ఫాస్ట్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఇంతలో అతనికి సడెన్‌గా పెద్ద తుమ్ము వచ్చింది. ఆ తర్వాత కొంచెం దగ్గు కూడా వచ్చింది. ఇంతలోనే పొత్తికడుపు భాగంలో తడిగా తగిలింది. పొత్తి కడుపులో నొప్పి రావడం స్టార్ట్‌ అయ్యింది. ఆయన పొట్ట భాగంలో రక్తం కారడం మొదలైంది. ఏం జరిగిందా అని చూస్తే పేగుల జారిపోయి.. పొట్ట నుంచి బయటకు వచ్చేశాయి.

పేగులు జారిన భాగాన్ని చొక్కాతో గట్టిగా కట్టేశాడుత. అక్కడున్న వారు.. వెంటనే అంబులెన్స్‌కి సమాచారం అందించారు. అంబులెన్స్ రాగానే.. వెంటనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. గతంలో సర్జరీ జరిగిన ప్రాంతంలో పొట్ట చీలుకున్నట్లు పారామెడిక్స్‌ గుర్తించారు. సుమారు 3 అంగుళాలు నిలువుగా చీలిక ఏర్పడింది, పెద్ద మొత్తంలో పేగులు బయటకు వచ్చినట్లు పారామెడిక్స్‌ తెలిపారు. అదృష్టవశాత్తూ ఆ వ్యక్తి ఎక్కువగా రక్తాన్ని కోల్పోలేదు. వైద్యులు బాధితుడికి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. డాక్టర్స్‌ సైతం ఈ కేసు చూసి షాకయ్యారు. ఇది అత్యంత అరుదైన కేసు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అలా ఎందుకు జరిగిందంటే?

అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్‌లో అతడి అసాధారణ కేసు, రికవరీ వివరాలను పేర్కొన్నారు. ఈ ఘటనకు ముందు బాధితుడు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌లో పోరాడాడు, ఈ ఘటన జరగడానికి ముందు పొట్ట వద్ద సర్జరీ చేయించుకున్నాడు. అతనికి ఫోర్స్‌గా తుమ్ము రావడంతో.. మూడు అంగుళాల కుట్లు తెగి, ప్రేగులు బయటకు వచ్చి ఉంటాయని పేర్కొన్నారు.

అత్యవసర విభాగంలో, యూరాలజీ సేవను వెంటనే అందించారు. శస్త్రచికిత్సకు ముందు రక్త పరీక్షలు కూడా నిర్వహించారు. రిపోర్ట్స్‌ నార్మల్‌గానే ఉన్నాయి. అతని కడుపు లోపలికి నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ చొప్పించి సమస్యను తెలుసుకొనే ప్రయత్నం చేశారు. అతడి ప్రాణాలకు ప్రమాదం లేకుండా ముగ్గురు సర్జన్లు జాగ్రత్తగా ఆ పేగులను తిరిగి అతడి పొట్టలో అమర్చారు. పొట్ట మళ్లి తెరుచుకోకుండా.. ఎనిమిది కుట్లు వేశారు. బాధితుడు ఆరు రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. డిశ్చార్జ్ చేయడానికి ముందు సాధారణ ఆహారం తీసుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా.. మనం తుమ్మేప్పుడు పెద్దలు ‘చిరంజీవా’ అని ఎందుకు అంటారో. బాధితుడికి అల్రెడీ పొట్టకు కుట్లు పడ్డాయి కాబట్టి.. పేగులు బయటకు వచ్చేశాయి. సాధారణ వ్యక్తుల్లో అలా జరగడం చాలా అరుదు. అయినా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీరు కూడా తుమ్మినప్పుడు జర భద్రం. చిరంజీవ.. చిరంజీవ..  

Also Read: నకిలీ వంట నూనెలను గుర్తించడం ఎలా? ఇవిగో ఈ చిట్కాలు మీ కోసమే!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget