(Source: ECI/ABP News/ABP Majha)
Hair Fall: ఒబేసిటీ వల్ల జుట్టు రాలిపోతుందా? దీన్ని అధిగమించడం ఎలా?
ఊబకాయం వల్ల గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉందని చాలా మందికి తెలుసు. కానీ ఇది మీ జుట్టుని కూడా నాశనం చేస్తుంది. జుట్టు బలహీనపడిపోయి రాలిపోయేలా చేస్తుంది.
బాన పొట్ట, బట్టతలతో మిమ్మల్ని మీరు ఒక్కసారి ఊహించుకోండి.. ఎలా ఉంది చూడటానికి భయంకరంగా అనిపిస్తుందా? ఎందుకంటే జుట్టు మొత్తం రూపానికి అందాన్ని ఇస్తుంది. కానీ పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటివి జుట్టు ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. జుట్టు నాణ్యతని నిర్ణయించడంలో జన్యుశాస్త్రం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బరువు, బొడ్డు చుట్టు పేరుకుపోయిన కొవ్వు, ఊబకాయం కూడా జుట్టు రాలడంతో సంబంధం కలిగి ఉంటుందని మీకు తెలుసా? అవును మీరు విన్నది నిజమే అధిక బరువు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అది భారమైనప్పుడు హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. రక్తప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ జుట్టు రాలడానికి దోహదం చేస్తాయి.
అధిక బరువు వల్ల జుట్టు రాలుతుందా?
ఊబకాయం, గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలు, థైరాయిడ్, మధుమేహం, ఇంటర్ ఆరోగ్య సమస్యలతో సహ తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. దీర్ఘకాలిక ఊబకాయం ఉన్న వ్యక్తి శరీర అవయవాలు క్షీణత, పనీతీరు తగ్గడం జరుగుతుంది. టోక్యో మెడికల్ అండ్ డెంటల్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన కొత్త పరిశోధన ప్రకారం ఊబకాయం, అధిక కొవ్వు ఆహారం, జుట్టు ఆరోగ్యం మధ్య సంబంధాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అధిక బరువు, కొవ్వు అధికంగా ఉండే ఆహారం వెంట్రుకలు పలుచన చేస్తుంది. జుట్టు కుదుళ్లు బలహీనపడిపోతాయి. అధిక పొట్ట కొవ్వు, స్థూలకాయం శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను సృష్టిస్తుంది. మగ సెక్స్ హార్మోన్ ఆండ్రోజెన్ ఉత్పత్తిలో పెరుగుదలకి దారితీస్తుందని పరిశోధన సూచిస్తుంది. టెస్టోస్టెరాన్ వంటి ఈ ఆండ్రోజెన్ళ్ళు జుట్టు కుదుళ్ళపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఫోలికల్స్ పరిమాణాన్ని తగ్గిస్తాయి. చివరికి జుట్టు రాలడం జరుగుతుంది.
జుట్టు రాలడాన్ని నియంత్రించే చిట్కాలు
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. జుట్టు పెరుగుదలకు పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చేర్చడం చాలా ముఖ్యం. ఇవి జుట్టు పలచబడటం ఆపేందుకు అద్భుతంగా పని చేస్తాయి. తగినంత నింద్రపోవడం కూడా మరొక పరిష్కారం. నిద్ర ఒత్తిడిని తగ్గించి కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఒత్తిడిని అదుపులో ఉంచుకునేందుకు యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలి.
తల మసాజ్ లేదా స్కాల్ఫ్ మసాజ్ జుట్టు ఆరోగ్యాన్ని పెంచేందుకు ఒక ప్రభావవంతమైన మార్గం. హెయిర్ ఫోలికల్స్ కు రక్తప్రవాహాన్ని పెంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అద్భుతమైన ఫలితాల కోసం కొబ్బరి నూనె లేదా మరేదైనా నూనెతో జుట్టుకి మసాజ్ చేసి చూడండి. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు రాలిపోవడం ఆగిపోవాలంటే మీరు బరువు తగ్గించే పని పట్టాలి. జుట్టు రాలడానికి మూల కారణం బరువు పెరగడమే. ఇది రక్త ప్రసరణన మెరుగుపరచదు. హీటింగ్ టూల్స్ ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే జుట్టుకి అంత ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. మితిమీరిన హెయిర్ స్టైలింగ్ కూడా వద్దు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మార్నింగ్ వాక్‌ను తక్కువ అంచనా వేయొద్దు - ఈ ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజే మొదలుపెట్టేస్తారు!