Deadly Fungal Infections : వచ్చే 25 ఏళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్లతో 40 మిలియన్ల మంది చనిపోతారట.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు
Global health threat : అంటువ్యాధులతో ప్రతి సంవత్సరం ఒక మిలియన్ కంటే ఎక్కువమంది ప్రాణాలు వదిలేస్తున్నారంటూ షాకింగ్ విషయాలు చెప్పింది తాజా అధ్యయనం. అవేంటంటే..
Deadly Diseases : ప్రాణాంతక ఇన్ఫెక్షన్లపై తాజాగా అధ్యయనం చేశారు. దీనిలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఔషద నిరోధక అంటువ్యాధుల ద్వారా 1900 నుంచి 2021 మధ్య ప్రతి సంవత్సరం ఒక మిలియన్ కంటే ఎక్కువ మంచి చనిపోయినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ కొత్త అధ్యయనంకి సంబంధించిన విషయాలన్ని ది లాన్సెట్‌లో ప్రచురించారు. సైలంట్ కిల్లర్ లాగా వ్యాప్తి చెందుతున్న ఈ ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్లు 25 ఏళ్లలో 40 మిలియన్ల మందిని చంపగలవంటూ షాకింగ్ విషయాలు తెలిపారు.
ప్రాణాంతక వ్యాధులు
బాక్టీరియాలు పరిణామం చెంది డ్రగ్ రెసిస్టెంట్‌గా మారినప్పుడు బాక్టీరియల్ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ జరుగుతుంది. ఇది న్యూమోనియా, యూటీఐ, అంతిసారం వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాపింపజేస్తుంది. దీనివల్ల పరిస్థితి ఎలా మారుతుందంటే.. ఇవి కూడా సాధారణ వ్యాధులే అనే రేంజ్లో ప్రజలు అలవాటు పడిపోతుంటారు. దీనివల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతారు. అందుకే 2050 నాటికి దాదాపు మృతుల సంఖ్య 40 మిలియన్లు చేరుకుంటుందని నివేదిక తెలిపింది. మరో 25 ఏళ్లలో ఇది జరగనుందంటూ షాకింగ్ విషయాలు తెలిపారు.
అందుబాటులో లేకపోవడంతో..
ఫంగల్ పాథోజెన్స్, యాంటీ ఫంగల్ రెసిస్టెన్స్ ముప్పు ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందుకే దీని గురించిన చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూకేలోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధకులు అధ్యయనం చేశారు. దీనిని కేవలం బ్యాక్టీరియాగానే చూడొద్దని.. దీనివల్ల జరిగే నష్టాన్ని గుర్తించి.. ప్రాణాంతక సమస్యగా అందరూ దీనిని తీసుకోవాలని చెప్తున్నారు. దీనికి సరైన ఔషదాలు అందుబాటులో లేకపోవడంతో ప్రాణాలు హరిస్తున్నాయని అంటున్నారు.
సరైన చర్యలు తీసుకోకుంటే..
మెరుగైన చికిత్స, తగిన యాంటీ బయాటిక్స్ ఉంటే బ్యాక్టీరియా వ్యాప్తిని కంట్రోల్ చేయవచ్చని అంటున్నారు. అంతేకాకుండా ఎన్నో ప్రాణాలను రక్షించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలన్సిన అవసరం ఉందని చెప్తున్నారు. సరైన చర్యలు తీసుకోకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్లు 6.5 మిలియన్లు మందికి సోకుతాయని.. ఏటా 3.8 మిలియన్లు మంది చనిపోతారని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కొన్ని దశాబ్ధాలుగా బ్యాక్టీరియా ఎందరో ప్రాణాలు హరించిందని.. ఇప్పటికైనా దీనిగురించి చర్యలు తీసుకోకపోతే ఆ సంఖ్య మరింత ఎక్కువ అవుతుందని అంటున్నారు.
అవి అందుబాటులోకి వస్తే..
ఇన్వాసివ్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి నాలుగు యాంటీ ఫంగల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి కాకుండా మరిన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే ఆహార భద్రత విషయంలో కూడా యాంటీ ఫంగల్ సేఫ్టీ ఫాలో అవ్వడం అవసరమని చెప్తున్నారు. ఈ వ్యాధికారకాల నుంచి ఆహారాన్ని ఎలా భద్రపరచుకోవాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనేవాటిపై కూడా అవగాహన కల్పించాలంటున్నారు.
Also Read : ఆ లక్షణాలు కిడ్నీ సమస్యలకు దారితీస్తాయట.. హెచ్చరిక సంకేతాలు ఇవే అంటోన్న నిపుణులు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.