అన్వేషించండి

Kidney Health Alert : ఆ లక్షణాలు కిడ్నీ సమస్యలకు దారితీస్తాయట.. హెచ్చరిక సంకేతాలు ఇవే అంటోన్న నిపుణులు

Hidden Warning Signs of Kidney Health : కిడ్నీలు డ్యామేజ్ అయితే ఆరోగ్యానికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అయితే కిడ్నీ సమస్యలు ఉంటే మన శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. అవేంటంటే.. 

Warning Signs of Kidney Damage : మూత్రపిండాలు మొత్తం ఆరోగ్యంలో ముఖ్యమైనపాత్ర పోషిస్తాయి. ఇవి రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు ద్రవాలను తొలగిస్తాయి. వాటిని శరీరం నుంచి బయటకు పంపడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. శరీరంలోని సోడియం, పొటాషియం, కాల్షియం వంటి రసాయనాల స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. రక్తపోటును నియంత్రించే హార్మోన్ల తయారీకి కిడ్నీలు బాధ్యత వహిస్తాయి. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. అయితే మూత్రపిండాల సమస్యలు అంత త్వరగా బయటపడవు. 

కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే.. అది వడపోత ప్రక్రియను నిర్వహించలేదు. దీనివల్ల శరీరంలో అదనపు నీరు టాక్సిన్లు పేరుకుపోతాయి. ఇవి వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. మూత్రపిండాల సమస్యలను మొదట్లో గుర్తించడం కష్టం. కానీ కొన్ని లక్షణాలతో కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించొచ్చు అంటున్నారు నిపుణులు. అలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయొద్దంటున్నారు. మూత్రపిండాల పనితీరులో లోపాలను చూపే లక్షణాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

అలసట

బ్లెడ్​ని ఫిల్టర్ చేసి.. శరీరం నుంచి విషాన్ని పంపడంలో మూత్రపిండాలు బాధ్యత వహిస్తాయి. అయితే అవి సరిగ్గా పనిచేయనప్పుడు.. శరీరంలో టాక్సిన్లు ఏర్పడతాయి. ఇవి ఎనర్జీని తగ్గించి అలసటనిస్తాయి. ఎర్ర రక్తకణాలను తయారు చేయడంలో కూడా కిడ్నీలు విఫలమవుతాయి. దీనివల్ల RBC తగ్గుతుంది. దీనివల్ల కండరాలు, మెదడుకు సరైన మొత్తంలో ఆక్సిజన్ అందదు. అప్పుడు మీరు ఏమి చేసినా.. చేయకున్నా అలసిపోతూ ఉంటారు. పైగా అలసట పలు ఆరోగ్య సమస్యల్ని సూచిస్తుంది. అందుకే మీరు త్వరగా నీరసపడిపోతున్నారనిపిస్తే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 

బ్లెడ్ యూరిన్

కిడ్నీలు సరిగ్గా పని చేయకుంటే.. మూత్రంలో అల్బుమిన్ అనే ప్రోటీన్ అధిక స్థాయిలో పెరుగుతుంది. దీనివల్ల యూరిన్​ ద్వారా నురుగు వస్తుంది. అలాగే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకుండా.. యూరిన్ గోధుమరంగు లేదా లైట్​ కలర్​లో మారిపోతుంది. మూత్రంశయంలోకి రక్తం లీక్​ అయ్యే ప్రమాదం ఎక్కువ అవుతుంది. దీనివల్ల యూరిన్ ద్వారా బ్లెడ్ లీక్ అవ్వొచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు, కణితులు, ఇన్​ఫెక్షన్ల వల్ల కూడా మూత్రం నుంచి రక్తం లీక్ అవుతుంది. 

కండరాల తిమ్మిరి..

మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకుంటే కండరాల తిమ్మిరికి దారితీస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలోని రసాయనాలను అసమతుల్యం చేస్తుంది. దీనివల్ల కండరాలు, నరాలపై ప్రెజర్ పడుతుంది. వాటి పనిలో అంతరాయం కలుగుతుంది. కండర రాశి దెబ్బతింటే.. ఏ పని చేసుకోవాలన్నా కష్టమే అవుతుంది.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్లాలి. వారు సూచించే మందులు, ఫుడ్​ని రెగ్యూలర్​గా తీసుకుంటే పరిస్థితి తీవ్రం కాకుండా ఉంటుందంటున్నారు నిపుణులు. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచే కొన్ని ఫుడ్స్​ను రెగ్యూలర్​గా డైట్​లో చేర్చుకోవాలి. అలాంటి వాటిలో రెడ్ బెల్ పెప్పర్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వెల్లుల్లి, ఉల్లిపాయ, యాపిల్స్, బెర్రీలు తీసుకోవచ్చు. ఈ ఫుడ్స్​లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పనులు అస్సలు చేయొద్దట.. మొదటి మూడు నెలల్లో ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాలట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Telangana: అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
Botcha Lakshman Rao :  ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
Hyderabad News: హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్
హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Harsha Sai: న్యూ*డ్ వీడియోలతో హర్షసాయి వేధింపులు - ఇన్‌స్టాలో క్లారిటీకేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Telangana: అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
Botcha Lakshman Rao :  ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
Hyderabad News: హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్
హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్ 
Nara Lokesh : నారా  లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
నారా లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
Dhruv Vikram New Movie: అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ - తెలుగు, తమిళ భాషల్లో భారీగా...
అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ - తెలుగు, తమిళ భాషల్లో భారీగా...
Anantapur: అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
Pawan Kalyan: సౌత్ ఇండియా
సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
Embed widget