By: Haritha | Updated at : 15 May 2023 07:17 AM (IST)
(Image credit: Pixabay)
నెయిల్ పాలిష్ వేసుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్. పొడవైన గోళ్లు, వాటిపై రంగురంగుల నెయిల్ పాలిష్ డిజైన్లు యువత మెచ్చే ఫ్యాషన్ గా మారింది. కానీ నెయిల్ పాలిష్ లో వాడే కొన్ని రకాల రసాయనాల వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉందని ఈ ఘటన నిరూపించింది. ఓ మహిళ ఎప్పటినుంచో నెయిల్ పాలిష్ ను వేసుకోవడం అలవాటుగా మార్చుకుంది. ఒకసారి ఆమెకు గోళ్లు విపరీతంగా నొప్పి పెట్టాయి. వేళ్ళ దగ్గర చర్మం చిరిగిపోయిన కాగితంలా మారిపోయింది. వేళ్లు కదల్చలేని పరిస్థితి వచ్చింది. దీంతో వైద్యుల వద్దకు వెళ్ళింది. వైద్యులు ఆమెకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిందని భావించారు. యాంటీబయోటిక్స్ తో చికిత్స అందించారు. దీంతో ఇన్ఫెక్షన్ నయమైంది. ఆమె మళ్లీ మెయిల్ పాలిష్ ను వేసుకుంది. దీంతో తిరిగి అవే లక్షణాలు కనిపించాయి. విపరీతమైన నొప్పితో చేతులు కూడా కదపలేనంత పరిస్థితికి వచ్చింది. గోళ్లు ఊదా రంగులోకి మారిపోయి, పెళుసుగా అయ్యాయి. విపరీతంగా దురద, నొప్పితో పాటూ ఆ లక్షణాలు చేతులకూ సోకాయి. దీంతో వైద్యులు ఆమెకు జెల్ నెయిల్ పాలిష్ లోని రసాయనాలు చర్మం లోకి ప్రవేశించి ఎనర్జీని కలిగించినట్లు గుర్తించారు. ఆమెను జీవితాంతం నెయిల్ పాలిష్ వేసుకోవద్దని హెచ్చరించారు. లేకుంటే ఈ అలెర్జీ వల్ల చేతి వేళ్లు కోల్పోయే పరిస్థితి రావచ్చని చెప్పారు.
నెయిల్ పాలిష్‌లలో మెథాక్రిలేట్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మం లోకి ప్రవేశించి చెడు ఎలర్జీలకు కారణం అవుతాయి. వీటివల్ల గోళ్లు పెళుసుగా మారి, విరిగిపోతాయి. దీర్ఘకాలంగా నొప్పి ఉంటుంది. నెయిల్ పాలిష్‌లలో ఈ రసాయనాన్ని వాడతారు, కాబట్టి వాటిని గోళ్ళకు వేసుకోకపోవడమే మంచిది. ఆ రసాయనం లేని నెయిల్ పాలిష్ లు ఏదో తెలుసుకోవడం కూడా కష్టమే. కాబట్టి నెయిల్ పాలిష్ వేసుకున్నాక ఏమాత్రం రియాక్షన్ కనిపించినా వాటిని దూరం పెట్టేయాలి. లేకుంటే అది చేతి వేళ్లు కోల్పోయే పరిస్థితికి తీసుకురావచ్చు. నెయిల్ పాలిష్ వేసుకునే ముందు గోళ్లకు SPF30 అనే సన్‌స్క్రీన్ లోషన్ రాసి ఆ తరువాత నెయిల్ పాలిష్ వేసుకోవడం ఉత్తమం.
నెయిల్ పాలిష్ లలో ట్రైఫెనెల్ ఫాస్పేట్ అనే రసాయనం కూడా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది శరీరంలో చేరితే నేరుగా హార్మోన్లపైనే ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడో ఒకసారి నెయిల్ పాలిస్ వేసుకుంటే ఫర్వాలేదు కానీ, నిత్యం వేసుకునే వారికి మాత్రం హానికర ప్రభావాలు పడే అవకాశం ఉంది. నెయిల్ పాలిస్ వేసుకున్న చేత్తోనే అన్నం తింటే ఆ రసాయనాలు పొట్టలోకి చేరే అవకాశం కూడా ఉంది. కాబట్టి కుడి చేతికి నెయిల్ పాలిష్ వేసుకోకపోవడమే మంచిది.
Also read: ఇలాంటి క్యాప్సికమ్‌లను తినడం వల్ల క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు
Also read: ఆస్తమా ఉన్నవారు వ్యాయామం చేస్తే ఆ సమస్య ఎక్కువవుతుందా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Chai-Biscuit: ఛాయ్‌తో బిస్కెట్స్ కలిపి తీసుకుంటున్నారా? మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందే
Air Conditioning: వేసవిలో ఏసీ లేకుండానే మీ రూమ్ ఇలా చల్లబరుచుకోవచ్చు
White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే
Hair: పొడవాటి జుట్టు కోసం మందార పువ్వులు ఆకులతో ఇలా చేయండి
Heart Attack: సోమవారాలే అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం, ఎందుకో తెలుసా?
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?