అన్వేషించండి

Morning Water Habit : ఉదయాన్నే నీళ్లు తాగుతున్నారా? ఆరోగ్యానికి ఈ అలవాటు మంచిదే కానీ, ఎవరు తాగకూడదో తెలుసా?

Morning Water : ఉదయం లేవగానే ముందుగా నీరు తాగాలని సూచిస్తున్నారు నిపుణులు. దీనిని అలవాటుగా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలున్నాయని.. కానీ కొందరు తాగకపోవడమే మంచిదన్నారు.

Drinking Water Right After Waking Up : ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంత నీరు అందించాలి. శరీరం హైడ్రేటెడ్​గా ఉన్నప్పుడు జీర్ణక్రియ, రక్త ప్రవాహం, శరీర ఉష్ణోగ్రత సమతుల్యతంగా ఉండి.. శరీరం నుంచి విష పదార్థాలు బయటకు వెళ్తాయి. అలాగే ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగే అలవాటు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

హైడ్రేషన్ కోసం..

రాత్రుళ్లు నిద్రపోయిన తర్వాత.. శరీరానికి చాలాసేపు నీరు అందదు. ఆ సమయంలో బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి ఉదయాన్నే నీరు తాగడం వల్ల ద్రవాలు తిరిగి నిండుతాయి. ఇవి అన్ని అవయవాలు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. అలాగే మీరు కూడా యాక్టివ్ అవుతారు. 

మెరుగైన జీవక్రియ..

ఉదయం పూట నీరు తాగడం వల్ల జీవక్రియ 30 శాతం వరకు పెరుగుతుంది. ఇది రోజంతా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో మీకు సహాయపడుతుంది. ఎనర్జిటిక్గా ఉండేందుకు.. బరువు నిర్వహణకు కూడా సహాయపడుతుంది.

టాక్సిన్స్ బయటకు పంపేందుకు..

శరీరం రాత్రిపూట తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. ఈ సమయంలో కొన్ని విషాలు శరీరంలో పేరుకుపోతాయి. ఉదయం నీరు తాగడం వల్ల ఈ విష పదార్థాలు బయటకు వెళ్లి మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.

మెరుగైన జీర్ణక్రియ

ఉదయం నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రియం అవుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. తీసుకునే ఆహారం కోసం కడుపును సిద్ధం చేస్తుంది. ఇది పోషకాల శోషణను కూడా మెరుగుపరుస్తుంది.

హెల్తీ స్కిన్ 

ఆరోగ్యకరమైన చర్మానికి తగినంత నీరు తాగడం చాలా అవసరం. ఉదయం నీరు తాగడం వల్ల చర్మం తేమను కాపాడుతుంది. ముడతలు తగ్గుతాయి. ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది.

మానసిక సామర్థ్యం

మెదడులో దాదాపు 75 శాతం నీటితో తయారవుతుంది. నీరు లేకపోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతుంది. ఉదయం నీరు తాగడం వల్ల దృష్టి, చురుకుదనం, మానసిక స్పష్టత మెరుగుపడతాయి.

ఎవరు తాగకూడదంటే..

ఉదయం పూట నీరు తాగడం చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని చండీగఢ్‌లోని డైట్‌కల్ప్ న్యూట్రిషన్ సెంటర్‌లోని పోషకాహార నిపుణురాలు డాక్టర్ జామ్నా శర్మ చెప్తున్నారు. మూత్రపిండాల వ్యాధి, గుండె వైఫల్యం, యాసిడ్ రిఫ్లక్స్ లేదా ఎడెమా ఉన్నవారు ఉదయం పూట ఎక్కువ నీరు తాగకూడదట. అలాంటి సందర్భాలలో వైద్యుడి సలహా చాలా అవసరమని చెప్తున్నారు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget