అన్వేషించండి

Natural Face Cleansers : ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి కెమికల్స్ ఫ్రీ టిప్స్

Glowing Skin Tips : మంచి క్రీములు, రిచ్ ప్రొడెక్ట్స ఉపయోగించినా.. కొన్నిసార్లు చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. మరి సహజంగా స్కిన్ హెల్త్ని మెరుగుపరిచే ఇంటి చిట్కాలు ఏంటో చూసేద్దాం.

DIY Natural Face Cleansers : ఈ రోజుల్లో బ్యూటీఫుల్ స్కిన్ కోసం చాలామంది వేల రూపాయలు ఖర్చు చేసి.. ఖరీదైన ఫేస్ వాష్‌లు, బ్యూటీ ప్రొడెక్ట్స్ కొంటున్నారు. ఇలాంటి ఉత్పత్తులు ప్రారంభంలో ఎఫెక్టివ్​గా పని చేస్తాయి. కానీ వాటిలో ఉండే కెమికల్స్ దీర్ఘకాలంలో చర్మాన్ని పొడిగా, నిర్జీవంగా, సున్నితంగా చేస్తాయి. చాలా సార్లు ఫేస్ వాష్ ఉపయోగించిన తర్వాత ముఖంపై బిగుతు, మంట, పొడిబారడం వంటి ఇబ్బంది తెలుస్తుంది. అటువంటి పరిస్థితిలో ముఖాన్ని సురక్షితంగా, ప్రభావవంతంగా ఎలా చూసుకోవాలనే డౌట్ వస్తుంది.

అందుకే చర్మ నిపుణులు కూడా సహజమైన, సేంద్రీయ వస్తువులను ఉపయోగించమని సలహా ఇస్తున్నారు. సహజ పదార్థాలు చర్మానికి హాని కలిగించకుండా శుభ్రపరుస్తాయి. లోపలి నుంచి పోషణనిస్తాయి. అంతేకాకుండా సరైన చర్మ రకాన్ని అర్థం చేసుకుని ఉపయోగిస్తే.. ఖరీదైన ఉత్పత్తుల అవసరం ఉండదు. కాబట్టి ఖరీదైన ఫేస్ వాష్‌ల కోసం డబ్బు వృధా చేయడానికి బదులుగా.. మీ వంటగదిలో ఉంచిన ఏ వస్తువులతో ముఖం మెరిసేలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. 

ఆయిల్ స్కిన్ కోసం..

మీ చర్మం జిడ్డుగా ఉండి.. మీరు పదేపదే ముఖం కడుక్కోవాల్సి వస్తే.. శనగపిండి, పెరుగు మిశ్రమం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. శనగపిండి చర్మం నుంచి అదనపు నూనె, మురికిని తొలగిస్తుంది. అయితే పెరుగు చర్మానికి తేమను అందిస్తుంది. ఈ పేస్ట్‌తో తేలికపాటి మసాజ్ చేయడం వల్ల ఫేస్ వాష్ లేకుండానే ముఖం శుభ్రంగా, తాజాగా మారుతుంది. 

ఇన్​స్టంట్ గ్లో కోసం.. 

పొడి, నిర్జీవ చర్మం కోసం.. తేనె ఉపయోగించవచ్చు. ఇది సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. నిమ్మకాయ మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ మిశ్రమంతో ముఖం శుభ్రం చేసినప్పుడు.. చర్మం వెంటనే తాజాగా, మెరుస్తూ కనిపిస్తుంది.

ముఖాన్ని శుభ్రం చేయడం కోసం.. 

పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. పసుపు క్రిమినాశకంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమంతో ముఖం శుభ్రం చేస్తే.. చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది.

సెన్సిటివ్ స్కిన్ కోసం 

ఎవరి చర్మం అయితే త్వరగా ఎర్రగా మారుతుందో లేదా మంటగా ఉంటుందో.. అలాంటి వారు కలబంద, రోజ్ వాటర్ మిశ్రమం అత్యంత సురక్షితమైన ఎంపికగా చెప్తారు. ఇది చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. హాని కలిగించకుండా ముఖాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. 

టాన్‌ని తొలగించడానికై..

ముఖంపై డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోయినా లేదా టాన్ ఏర్పడినా.. పెరుగు, ఓట్‌మీల్, తేనె మిశ్రమాన్ని వేసి చేతులతో సున్నితంగా రుద్దండి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి హెల్ప్ చేస్తుంది. ఈ స్క్రబ్ అయిన తర్వాత.. పసుపు, శనగపిండి, పాలు కలిపిన పలుచని మిశ్రమం ముఖానికి అప్లై చేయండి. ఇది మచ్చలు, టాన్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Right Time to Drink Water : నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు
నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది? ఇలా తాగితేనే బెస్ట్, లేదంటే సమస్యలు రావచ్చు
Kidney-Friendly Diet : కిడ్నీ వ్యాధులు ఉన్నవారు తినకూడని ఫుడ్స్ ఇవే.. లేదంటే మరింత ప్రమాదమంటోన్న వైద్యులు
కిడ్నీ వ్యాధులు ఉన్నవారు తినకూడని ఫుడ్స్ ఇవే.. లేదంటే మరింత ప్రమాదమంటోన్న వైద్యులు
Tips To Happy Marriage : మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్.. లేదంటే నరకంగా మారొచ్చు
మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్.. లేదంటే నరకంగా మారొచ్చు
Rare Paediatric Robotic Surgery : యశోద హాస్పిటల్స్‌లో అరుదైన చికిత్స.. రోబోటిక్ సర్జరీతో 2 నెలల చిన్నారికి కొత్త జీవితం, ఫుల్ డిటైల్స్ ఇవే
యశోద హాస్పిటల్స్‌లో అరుదైన చికిత్స.. రోబోటిక్ సర్జరీతో 2 నెలల చిన్నారికి కొత్త జీవితం, ఫుల్ డిటైల్స్ ఇవే

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Pre Diabetic Care : ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
Embed widget