అన్వేషించండి

Abhijeet Dipke Typhoid: టైఫాయిడ్ బారిన పడిన అభిజిత్ దీప్కే.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ? ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది

Typhoid Symptoms | కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కేకు టైఫాయిడ్ వచ్చిందని సోషల్ మీడియాలో తెలిపారు. అయితే టైఫాయిడ్ లక్షణాలు, చికిత్స విధానం తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అభిజిత్ దిప్కేకు టైఫాయిడ్; కలుషిత ఆహారం/నీటితో వ్యాపిస్తుంది.
  • తీవ్ర జ్వరం, అలసట, కడుపు నొప్పి లక్షణాలు; చికిత్స ఆలస్యమైతే ప్రమాదం.
  • రక్త పరీక్షల ద్వారా నిర్ధారణ; శుభ్రత, టీకాలు వ్యాధిని నివారిస్తాయి.

Abhijeet Dipke Diagnosed with Typhoid : వర్షాకాలంలో టైఫాయిడ్ కేసులు రావడం సర్వసాధారణం. అయిది ఇది మామూలు జ్వరం అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. సకాలంలో చికిత్స అందకపోతే అనారోగ్యం తీవ్రత పెరగవచ్చు. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ తనకు టైఫాయిడ్ వచ్చిందని, చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

తన బ్లడ్ టెస్టులో టైఫాయిడ్ నిర్ధారణ అయిందని, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం IV (ఇంట్రావీనస్) ద్వారా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. టైఫాయిడ్ ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలు ఏమిటి. ఈ వ్యాధి ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో ఒక్కడ తెలుసుకుందాం.

టైఫాయిడ్ అంటే ఏంటీ.. ఎలా వస్తుంది ?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫీ (Salmonella Typhi) బ్యాక్టీరియా వల్ల కలిగే బాక్టీరియా ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది వేగంగా రక్తంలో వ్యాపించి ఇన్ఫెక్షన్‌ను వేగంగా పెంచుతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.1 కోట్ల నుండి 2.1 కోట్ల మంది టైఫాయిడ్‌ బారిన పడుతున్నారు. దాదాపు 2 లక్షల మంది ఈ వ్యాధి కారణంగా చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల పారాటైఫాయిడ్ కేసులు సైతం నమోదవుతాయి. వీటిలో ఎక్కువ కేసులు దక్షిణాసియాలో నమోదవుతున్నాయి. 

టైఫాయిడ్ లక్షణాలు ఏమిటి?

టైఫాయిడ్ ప్రారంభ లక్షణాలు సాధారణంగా బ్యాక్టీరియా సోకిన 10 నుండి 14 రోజుల తర్వాత కనిపిస్తాయి. పేషెంట్ కి తీవ్రమైన జ్వరం వస్తుంది. దీంతో పాటు తలనొప్పి, అలసట, కడుపు నొప్పి, వికారం, వాంతులు, బలహీనత, ఆకలి తగ్గడం, మలబద్ధకం లేదా అతిసారం, కండరాల నొప్పి, శరీరంపై దద్దుర్లు లాంటి లక్షణాలు ఉంటాయి. చికిత్స చేయకపోతే, ఈ వ్యాధి 3 నుండి 4 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటుంది. 

Also Read: Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు

టైఫాయిడ్ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?

సకాలంలో చికిత్స అందకపోతే టైఫాయిడ్ సమస్య పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాధి వివిధ దశలలో రోగికి తీవ్రమైన జ్వరం, కడుపు ఉబ్బరం, వేగంగా బరువు తగ్గడం, డీహైడ్రేషన్, డెలిరియం, అంతర్గత రక్తస్రావం, మెదడు వాపు, ప్రేగులకు తీవ్రమైన గాయం, కిడ్నీ ఫెయిల్యూర్, న్యుమోనియా, ప్యాంక్రియాస్‌లో వాపు, మెనింజైటిస్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక కొన్ని రోజులపాటు తీవ్రమైన జ్వరం లేదా ఇతర తీవ్రమైన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

టైఫాయిడ్‌లో IV ఎందుకు ఇస్తారు?

టైఫాయిడ్ తీవ్రమైన కేసులలో రోగి శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఏర్పడవచ్చు. ఆ సందర్భాలలో, IV ద్వారా శరీరంలోకి ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు ఇస్తారు. IV ద్వారా మందులు నేరుగా రక్తప్రవాహంలోకి చేరి త్వరగా ప్రభావం చూపుతాయి. ఈ కారణంగానే చాలా మంది రోగుల చికిత్సలో IV థెరపీని ఉపయోగిస్తారు. 

టైఫాయిడ్‌ను ఎలా గుర్తిస్తారు?

ఒక వ్యక్తిలో టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తే, డాక్టర్లు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు. దీని కోసం బ్లడ్ టెస్ట్, టైఫీ డాట్ టెస్ట్, బ్లడ్ కల్చర్, స్టూల్, యూరిన్ టెస్ట్, విడాల్ టెస్ట్  వంటి పరీక్షలు చేస్తారు. కొన్ని కేసులలో యాంటీబయాటిక్ మందుల తర్వాత కూడా కోలుకోకపోతే బోన్ మ్యారో కల్చర్ చేయించుకోవాలని సూచిస్తారు. 

టైఫాయిడ్ నుండి ఎలా రక్షించుకోవాలి?

టైఫాయిడ్ నుండి రక్షించుకోవడానికి శుభ్రమైన, సురక్షితమైన నీటిని తాగాలి. బాగా వండిన, తాజా ఆహారాన్ని తినాలి. తినడానికి, తయారు చేయడానికి ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం, రోడ్డు పక్కన బహిరంగంగా ఉంటే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇంటి చుట్టూ పరిశుభ్రతను పాటించాలి. టైఫాయిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లే ముందు, డాక్టర్ సలహా మేరకు టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా వేయించుకోవచ్చు.  

Disclaimer: ఈ సమాచారం పరిశోధనా అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా భావించవద్దు. ఏదైనా కొత్త వ్యాయామాన్ని ప్రారంభించే ముందు, మెడిసిన్ వాడే ముందు మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుడిని తప్పకుండా సంప్రదించండి.

Frequently Asked Questions

టైఫాయిడ్ అంటే ఏమిటి, అది ఎలా వ్యాపిస్తుంది?

టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా వల్ల వచ్చే బాక్టీరియా ఇన్ఫెక్షన్. కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి రక్తంలో వేగంగా వ్యాపిస్తుంది.

టైఫాయిడ్‌లోని ప్రధాన లక్షణాలు ఏమిటి?

టైఫాయిడ్ సోకిన వారికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, అలసట, కడుపు నొప్పి, వికారం, వాంతులు, ఆకలి తగ్గడం, మలబద్ధకం/అతిసారం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

టైఫాయిడ్ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది?

సకాలంలో చికిత్స అందకపోతే టైఫాయిడ్ తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. డీహైడ్రేషన్, అంతర్గత రక్తస్రావం, కిడ్నీ ఫెయిల్యూర్, మెనింజైటిస్ వంటివి రావచ్చు, కాబట్టి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

టైఫాయిడ్ నుండి ఎలా రక్షించుకోవచ్చు?

టైఫాయిడ్ నుండి రక్షించుకోవడానికి శుభ్రమైన నీరు, వండిన ఆహారం తీసుకోవాలి. చేతులు కడుక్కోవడం, బహిరంగ ఆహారాలకు దూరంగా ఉండటం, పరిశుభ్రత పాటించడం, వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget