అన్వేషించండి

White Hair : వయసుతో పాటు జుట్టు తెల్లగా ఎందుకు మారుతుంది? ఈ ప్రాసెస్​ను ఆలస్యం చేయవచ్చా? 

Hair Greying : వయసు పెరిగేకొద్ది జుట్టు తెల్లబడుతుంది. అయితే ఈ సహజమైన ప్రక్రియ వెనుక కారణం ఏంటి? దీనిని ఆలస్యం చేసి.. మరికొంత కాలం జుట్టును నల్లగా ఉంచుకోవచ్చా?

Grey Hair Causes : కొందరికి జుట్టు చిన్న వయసులోనే మెరుస్తుంది. మరికొందరికి వయసుతోపాటు పెరుగుతుంది. వయసుతో పాటు శరీరంలో వచ్చే మార్పుల్లో ఈ జుట్టు తెల్లబడటం కూడా ఒకటి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది. ఈ ప్రక్రియను ఆలస్యం చేయవచ్చా? కారణాలు ఏంటి? నిపుణులు ఏమంటున్నారో చూసేద్దాం. 

వయసు పెరిగే కొద్దీ జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. ఇలా జుట్టు తెల్లబడటం అనేది సహజ ప్రక్రియ. శరీరంలోని ఇతర భాగాలు వయస్సు పెరిగేకొద్దీ.. జుట్టు కూడా వృద్ధాప్యానికి గురవుతుంది. చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జుట్టు రంగును నిర్ణయించే కణాలు కాలక్రమేణా బలహీనపడతాయి. దీనివల్ల జుట్టు క్రమంగా దాని సహజ రంగును కోల్పోతుంది. దీనిని నివారించవచ్చో లేదో తెలుసుకుందాం.

నిపుణులు ఏమంటున్నారు?

చాలా మందిలో 30 లేదా 40 సంవత్సరాల తర్వాత జుట్టు తెల్లబడటం ప్రారంభిస్తుందని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం మెలనోసైట్ స్టెమ్ సెల్స్ బలహీనపడటం. ఈ కణాలు జుట్టుకు మెలనిన్ వర్ణద్రవ్యాన్ని అందిస్తాయి. దీనివల్ల జుట్టుకు నలుపు, గోధుమ లేదా బంగారు రంగు వస్తుంది. ఈ కణాలు సరిగ్గా పనిచేయడం మానేసినప్పుడు.. జుట్టు తెల్లగా లేదా బూడిద రంగులోకి మారడం ప్రారంభమవుతుంది.

ఈ మొత్తం ప్రక్రియను వైద్యపరంగా సెల్యులార్ సెనెసెన్స్ అంటారు. ఈ ప్రక్రియలో జుట్టు క్రమంగా దాని వర్ణద్రవ్యం ఉత్పత్తిని తగ్గిస్తుంది. అందుకే గతంలో నల్లగా లేదా గోధుమ రంగులో ఉన్న జుట్టు కాలక్రమేణా బూడిద లేదా తెలుపుగా కనిపించడం ప్రారంభిస్తుంది. బూడిద జుట్టు ఆకృతి ముతకగా లేదా మందంగా మారుతుందట. వయస్సుతో పాటు జన్యుశాస్త్రం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే వారి తల్లిదండ్రుల మాదిరిగానే జుట్టు బూడిద రంగులోకి మారుతారని నిపుణులు అంటున్నారు. అయితే ఈ ప్రక్రియ మారే ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుందని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి.

జుట్టు తెల్లబడటాన్ని ఆపవచ్చా?

జుట్టు తెల్లబడటం అనివార్యమని, తిరిగి మార్చలేనిదని ఒకప్పుడు నమ్మేవారు. అయితే ఈ ప్రక్రియ పూర్తిగా నమ్మేది కాదని పరిశోధనలు చూపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని అంశాలు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. మరికొన్ని నెమ్మదించేలా చేస్తాయి. కొన్ని అధ్యయనాలు విటమిన్ బి12, ఇనుము వంటి పోషకాహార లోపాలు వైట్ హెయిర్​కు కారణమని చెప్పాయి. దీర్ఘకాలిక ఒత్తిడికి కూడా ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుందట. అయితే జుట్టు తెల్లబడటాన్ని పూర్తిగా నిరోధించలేకపోయినా.. సమతుల్య ఆహారం, ఒత్తిడి నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవనశైలితో నెమ్మదించేలా చేయవచ్చని చెప్తున్నారు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget