అన్వేషించండి

Feeling Sleepy After Eating : భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? నిద్రమత్తును దూరం చేసే టిప్స్ ఇవే

Sleepy Right After Eating : చాలామందికి భోజనం చేసిన తర్వాత నిద్ర వస్తుంది. దీనికి కారణాలు ఏంటో.. నిద్రమత్తును ఎలా దూరం చేసుకోవాలో.. ఇప్పుడు చూసేద్దాం.

భోజనం చేసిన వెంటనే మత్తుగా అనిపిస్తోందా? దీని వెనుక కారణాలివే

1/9
ఆహారం తిన్న తర్వాత దానిని జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియకు శక్తి అవసరం కావడంతో కొందరికి అలసట, మత్తు లేదా నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది చాలా సందర్భాల్లో సహజమైన ప్రతిస్పందనగా చెప్తారు.

2/9
తెల్ల బియ్యం, బిర్యానీ, స్వీట్లు, బ్రెడ్, పాస్తా వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది. ఆ తర్వాత అవి తగ్గినప్పుడు మత్తు, బద్ధకం, నిద్ర ఎక్కువగా అనిపించవచ్చు.

3/9
అవసరానికి మించి భోజనం చేస్తే జీర్ణవ్యవస్థపై భారం పెరుగుతుంది. దీంతో శరీరం విశ్రాంతి కోరినట్లు అనిపించి నిద్రమత్తు రావచ్చు. కాబట్టి ఒకేసారి ఎక్కువగా తినడం కంటే పరిమితంగా తినడం మంచిది.

4/9
రాత్రి తగినంత నిద్రపోకపోతే భోజనం చేసిన తర్వాత ఆ అలసట మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కారణం భోజనం కాకుండా, నిద్రలేమి కూడా కావచ్చు.

5/9
డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిలో భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిల్లో వచ్చే మార్పుల వల్ల కూడా నిద్ర, అలసట కలగవచ్చు. ఇది తరచూ జరుగుతుంటే ఒకసారి వైద్యుడిని సంప్రదించి రక్తంలో చక్కెర పరీక్ష చేయించుకోవడం మంచిది.

6/9
అన్నం, పాలు, గుడ్లు, అరటిపండ్లు వంటి కొన్ని ఆహారాల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తిలో పాత్ర పోషిస్తుంది. అయితే సాధారణంగా ఒక్క ఆహార పదార్థం వల్లే ఎక్కువ నిద్ర వస్తుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. మొత్తం భోజనం ప్రభావం చూపుతుందట.

7/9
భోజనం చేసిన ప్రతిసారీ తీవ్రమైన నిద్ర, బలహీనత, తల తిరగడం లేదా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే అది డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించడం మంచిది.

8/9
నిద్రమత్తు తగ్గాలంటే ఒకేసారి ఎక్కువగా తినకుండా చిన్న చిన్న మోతాదుల్లో భోజనం చేయాలట. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. భోజనం చేసిన వెంటనే పడుకోకుండా 10 నుంచి 15 నిమిషాలు నెమ్మదిగా నడవండి. రోజూ 7 నుంచి 9 గంటలు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

9/9
భోజనం తర్వాత తరచూ అధిక అలసట వస్తే రక్తంలో చక్కెర, హిమోగ్లోబిన్ వంటి పరీక్షల గురించి వైద్యులను సంప్రదిస్తే మంచిదట. అప్పుడప్పుడు భోజనం తర్వాత నిద్రమత్తు రావడం సాధారణమే. అయితే ఇది ప్రతిరోజూ తీవ్రంగా ఉంటే వైద్య సహాయం తీసుకోవాలట.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget