Migraine: వర్షాకాలంలో మైగ్రేన్ తలనొప్పి వేధిస్తోందా? ఈ ఆయుర్వేద మందులను వాడండి
మైగ్రేన్‌తో బాధపడే వారి సంఖ్య అధికంగానే ఉంది.
మైగ్రేన్ తలనొప్పి సాధారణంగానే వేధిస్తుంది. ఇక వానాకాలంలో మరింత వేధించే అవకాశం ఉంది. ఎందుకంటే వాతావరణ మార్పు వల్ల మైగ్రేన్ తలనొప్పి అధికంగా వచ్చే అవకాశం ఉంది. వికారం, అధిక కాంతికి, అధిక ధ్వనికి తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు దీనిలో కనిపిస్తాయి. మైగ్రేన్‌ను తీవ్రమైన తలనొప్పిగానే పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. వానాకాలంలో ప్రజలు అధికంగా మైగ్రేన్ తలనొప్పి గురి కావడానికి ప్రధాన కారణం. వానాకాలంలో వాతావరణంలో తేమ స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల వారికి తలనొప్పి అధికమవుతుంది. వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలలో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మెదడుకు రక్తప్రసరణను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల కూడా మైగ్రేన్ తలనొప్పి ప్రారంభమవుతుంది.
మైగ్రేన్ తలనొప్పి రావడానికి అనేక రకాల ట్రిగ్గర్లు ఉంటాయి. గాలిలో తేమ పెరిగినా, చుట్టూ శిలీంద్రాలు అధికంగా ఉండే వాతావరణం ఉన్నా, దుమ్ము, పుప్పొడి వంటి ఎలర్జీ కారకాలు ఉన్నా కూడా మైగ్రేన్ లక్షణాలు తీవ్రంగా మారుతాయి. కాబట్టి ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం మైగ్రేన్‌ను కొన్ని రకాల మందులతో అడ్డుకోవచ్చు.
శిరోలేపా
మైగ్రేన్... ఒత్తిడి వంటి మానసిక అలసట వల్ల కూడా వస్తాయి. వాటిని తగ్గించే శక్తి శిరోలేపాలో ఉంది. దీన్ని కొన్ని మూలికలను కలిపి మెత్తని పేస్టులా తయారు చేస్తారు. ఆ పేస్ట్‌ను తలపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ పేస్టును తలపై రాసుకున్నాక అరటి ఆకుతో కప్పేయాలి. అలా గంటపాటు ఉంచితే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.
శిరోధార
వెచ్చని నూనెను తలపై చిన్న ధారలా పోస్తారు. అక్కడే మన నరాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. నూనె నిరంతరం పోసినప్పుడు ఆ ఒత్తిడి నుదుటిపై కంపనాన్ని సృష్టిస్తుంది. ఇది మనస్సు, నాడీ వ్యవస్థను మానసిక విశ్రాంతిని పొందేందుకు దోహదం చేస్తుంది.
కవలగ్రహ
కవలగ్రహ అనేది నిర్విషీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. మైగ్రేన్ అటాక్‌లు రాకుండా ఉండేందుకు చందనం వంటి తైలాలను, మహానారాయణ అనే తైలాన్ని ఆయిల్ పుల్లింగ్ చేయమని ఆయుర్వేదం సూచిస్తుంది.
స్నేహ నాసాయ
ఈ చికిత్స ముక్కు మార్గం ద్వారా చేస్తారు. శిబిందు తైలం లేదా అను తైలం వంటి మందులను చుక్కల రూపంలో నాసికా రంధ్రాలలో వేస్తారు. ఇది భుజం ప్రాంతంపై ఉన్న నొప్పిని కూడా తగ్గిస్తుంది. అలాగే మైగ్రేన్ రాకుండా అడ్డుకుంటుంది.
Also read: కడుపునొప్పి వచ్చిందని ఆసుపత్రికి వెళితే, ఒకరోజు మాత్రమే బతుకుతావని చెప్పిన వైద్యులు
Also read: ఏడ్చి ఏడ్చి అంధుడిగా మారిన వ్యక్తి, అలాంటి పనులు చేస్తే ఇలానే జరుగుతుంది మరి