అన్వేషించండి

అతడి అంగాన్ని చేతికి కుట్టేసిన వైద్యులు, కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

అతడి చేతిని చూసిన తర్వాత మీరు తప్పకుండా.. ‘‘అదేంట్రా బుజ్జీ.. ఆడి చేతికి అంగం అలా మొలిచింది. అదేదో మొక్కకు అంటు కట్టినట్లు..’’ అని అనకుండా ఉండలేరు.

ను, మీరు చదివింది నిజమే. ‘అక్కడ’ ఉండాల్సిన మర్మాంగం అతడి చేతికి వేలాడుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. గత ఆరేళ్లుగా అతడు అలాగే జీవిస్తున్నాడు. వైద్యులే స్వయంగా అతడి చేతికి అంగాన్ని కుట్టేశారు. అయితే, ఇదేదో పొరపాటున చేయలేదు. అతడి మేలు కోసమే చేశారు. ఇప్పటి వరకు ప్రపంచంలో మరే వ్యక్తికి చేయని అరుదైన శస్త్ర చికిత్సను అతడికి అందించారు. కానీ, మూత్ర ద్వారం వద్ద ఉండాల్సిన అంగాన్ని, చేతికి కుట్టేస్తే ఏం లాభం? అది దేనికి పనికి వస్తుందనేగా మీ సందేహం? అక్కడే ఉంది ట్విస్ట్. 

ఇంగ్లాండులోని నార్ఫోల్క్‌లో నివసిస్తున్న మాల్కోలమ్ మెక్‌డోనాల్డ్(47) ఓ రోజు టాయిలెట్‌లో పడిపోయాడు. దీంతో అతడి అంగం నలిగిపోయింది. పెరినియం ఇన్ఫెక్షన్ సోకడం వల్ల అతడి అంగం నల్లగా మారిపోయి కుళ్లిన స్థితికి చేరుకుంది. 2014లో అతడికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. అంగాన్ని తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో అతడికి గుండె జారినంత పనైంది. ఈ విషయం తెలిసి అతడి భార్య పిల్లలతో సహా అతడిని వదిలేసి వెళ్లిపోయింది. దయనీయ స్థితిలో ఉన్న అతడికి ప్రొఫెసర్ డెవిడ్ రాల్ఫ్ దేవుడిలా కనిపించాడు. 

విరిగిన, ఊడిన మర్మాంగాలకు మరమ్మత్తులు చేయడంలో రాల్ఫ్ నేర్పరి. కొద్ది రోజులు మాల్కోలమ్ పరిస్థితిని గమనించి.. అది పూర్తిగా కుళ్లిపోయే లోపే తొలగించాలని, లేకపోతే ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు సోకే ప్రమాదం ఉందని చెప్పారు. అయితే, తీసేసిన అంగాన్ని మళ్లీ అతికిస్తామని, ఆందోళన చెందవద్దని అతడికి భరోసా ఇచ్చారు. అయితే, వారు దాన్ని అతికించిన ప్లేస్ మాత్రం వేరు. 

అంగాన్ని తిరిగి అతికిస్తామని రాల్ఫ్ చెప్పిన వెంటనే అతడు చాలా సంతోషించాడు. కానీ, దాన్ని చేతికి అతికించనున్నామని చెప్పగానే షాకయ్యాడు. నవ్వాలో.. ఏడ్వాలో తెలియని పరిస్థితి. అలా ఎందుకు చేయాల్సి వస్తుందో చెప్పిన తర్వాత అతడు కాస్త లైట్‌గా ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకంటే.. ఇప్పటివరకు వైద్యులు అలాంటి చికిత్స చేయలేదు. అది సక్సెస్ అవుతుందో లేదో కూడా తెలీదు. అందుకే, మాల్కోలమ్ సంతోషంగా ఉండలేకపోయాడు. 

చేతికి ఎందుకు అతికించారు?: ఇన్ఫెక్షన్ వల్ల మాల్కోలమ్ అంగంపై ఉన్న చర్మం పూర్తిగా పనికి రాకుండా పోయింది. కేవలం కండరాలు మాత్రమే మిగిలాయి. అందుకే, వైద్యులు సెలైన్ వ్యవస్థతో అంగాన్ని తయారు చేశారు. ఇందుకు అతడి చేయ్యి, తొడ నుంచి సేకరించిన చర్మాన్ని ఉపయోగించారు. అలా తయారు చేసిన అంగాన్ని 2016లో అతడి ఎడమ చేయికి అమర్చారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కనిపించాలని చెప్పారు. 

Also Read: భూమి తిరగడం ఆగిపోతే అంత భయానకంగా ఉంటుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన ఖగోళ శాస్త్రవేత్త

అనివార్య కారణాల వల్ల అతడికి శస్త్ర చికిత్స ఆలస్యమైంది. ఆ తర్వాత కోవిడ్-19 వచ్చింది. అలా అతడు సుమారు ఆరేళ్లుగా చేతికి వేలాడుతున్న అంగంతో తిరుగుతున్నాడు. అయితే, అది సాధారణ అంగంలా పనిచేయదు. అందులో హ్యాండ్ పంప్ ఉంటుంది. చిన్న ట్యాంక్‌లో సెలైన్ ఉంటుంది. పంప్ నొక్కినప్పుడు అంగంలోని ట్యూబ్‌లోకి సెలైన్ వెళ్లి.. అంగస్థంభన జరుగుతుంది. అంటే, అంగాన్ని అతికించిన తర్వాత ఎప్పటిలాగానే అంగం నుంచి మూత్రం పోయవచ్చు. శృంగారంలో కూడా పాల్గోవచ్చు. ఎట్టకేలకు వైద్యులు అతడి చేతికి ఉన్న అంగాన్ని తొలగించారు. దాన్ని అతడి కాళ్ల మధ్యలో అమర్చారు. ఇప్పుడు అతడు మళ్లీ తన మగతనాన్ని పొందాడు. కానీ, సాధారణ పురుషులకు ఉండే అంగానికి, దానికి ఎంతో తేడా ఉంటుంది. ఇది దాదాపు చర్మంతో తయారైన కృత్రిమ అంగం. 

Also Read: క్రీడాకారుల మలంతో ప్రత్యేక మాత్రలు - వీటిని ఏ వ్యాధికి వాడతారో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
Embed widget